కరోనా రోగుల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే ఔషధంపై ట్రీట్‌మెంట్ ట్రయల్

  • Published By: srihari ,Published On : June 15, 2020 / 02:22 PM IST
కరోనా రోగుల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే ఔషధంపై ట్రీట్‌మెంట్ ట్రయల్

Updated On : June 15, 2020 / 2:22 PM IST

ప్రాణాంతక కోవిడ్ -19 సోకిన వారిలో రక్తం గడ్డకట్టడాన్ని ఒక ప్రయోగాత్మక ఔషధం నిరోధించగలదా అనేదానిపై శాస్త్రవేత్తలు లోతుగా పరీక్షించే పనిలో పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి ద్వారా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రక్తం గడ్డకడుతుంది. దీనికి సంబంధించి పరీక్షించడానికి అవసరమయ్యే నిధులను బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్  సమకూర్చుతుంది. కరోనా ప్రభావాన్ని నివారించడానికి ప్రస్తుతం పరీక్షించే అనేక ఔషధాలలో ఇది ఒకటి కానుంది. ఆస్పత్రిలో చేరిన కరోనా రోగులలో మూడవ వంతు మందిలో రక్తం గడ్డకడుతోంది. TRV027 అనే ఔషధం రక్తపోటు, నీరు, ఉప్పులోని హార్మోన్లను తిరిగి సమతుల్యం చేసేలా పనిచేస్తుంది. కరోనా చికిత్సకు సంబంధించి నిర్వహించిన ట్రయల్‌లో పాల్గొన్న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని వెల్లడించారు. 

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. అది కణాలలోకి ప్రవేశించడానికి ఎంజైమ్‌ను ‘హ్యాండిల్’గా ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. కానీ ఇది ఎంజైమ్‌ను నిలిపివేస్తుంది. కీ హార్మోన్‌లను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమతుల్యత లేనప్పుడు రక్తం అంటుకునేలా చేస్తుంది. 2012లో TRV027 డ్రగ్ సృష్టికర్త నోబెల్ బహుమతిని గెల్చుకున్నారు. ఈ రీబ్యాలెన్సింగ్ పాత్రను పోషించగలదని నిర్ధారించారు. కానీ హార్మోన్ల అసమతుల్యత అనేది చాలా విభిన్నమైన సమస్యగా పేర్కొన్నారు. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. కొంతమందికి ఎందుకు తీవ్రంగా అనారోగ్యం కలుగుతుంది అనే ప్రశ్నకు ఆధారాలుగా ఉన్నాయని అధ్యయనంలో ఒకరైన డాక్టర్ డేవిడ్ ఓవెన్ చెప్పారు.

అనేక మందులతో ట్రయల్ :
కోవిడ్ -19 అనేది శరీరంలోని అనేక వ్యవస్థలను ప్రభావితం చేసే ఒక సంక్లిష్ట వ్యాధి. ఈ చికిత్సను ఇతర ఔషధాలతో కలిపి ఉపయోగించవచ్చననే అధ్యయనంపై డాక్టర్ కాట్ పొల్లాక్ చెప్పారు. వచ్చే నెల నుంచి 60 మంది రోగులకు కొత్త ప్రయోగాత్మక ఔషధం లేదా placebo ఇవ్వనున్నట్టు చెప్పారు. తీవ్రమైన గుండెజబ్బులున్నవారిలోనూ ఈ డ్రగ్ వాడకం సురక్షితం అని తేలింది. అయినప్పటికీ కరోనా చికిత్సగా ప్రభావవంతమైనది కాదు. వ్యాధి ప్రభావాలను తగ్గించడానికి లేదా శరీరం దానితో పోరాడటానికి సాయపడేలా ట్రయల్ చేస్తున్న వివిధ ఔషధాలలో TRV027 ఒకటిగా చెప్పవచ్చు. 

HIV చికిత్సకు వాడే lopinavir/ritonavirతో సహా కనీసం 10 వేర్వేరు యాంటీవైరల్ మందులు ఉన్నాయి. ఇవి కరోనా వ్యాధితో పోరాడటానికి సాయపడతాయో లేదో పరీక్షించనున్నారు. రోగుల వ్యాధులను తగ్గించే అనేక ఔషధాలను కలిపి ఉపయోగించవచ్చనని, ఏదీ స్వయంగా సమర్థవంతంగా చూపలేదని అంటున్నారు. శరీర కణాల లోపల వైరస్ అవసరమయ్యే ఎంజైమ్‌పై దాడి చేయడం ద్వారా రెమ్‌డెసివిర్ అనే ఔషధం పనిచేస్తుందని అంటున్నారు. కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో తీసుకున్న ప్లాస్మా రక్తం ద్రవ భాగం కూడా బాగానే పనిచేస్తుందని చెబుతున్నారు.