Coronavirus : కోలుకుంటున్న బోరిస్ జాన్సన్

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 12:21 AM IST
Coronavirus : కోలుకుంటున్న బోరిస్ జాన్సన్

Updated On : April 10, 2020 / 12:21 AM IST

కరోనా రాకాసి బారిన పడిన UK ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరగుపడింది. చికిత్స అందిస్తున్న ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, కానీ..కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. చికిత్స అందివ్వాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. బ్రిటన్ దేశంలో కరోనా భూతం కుమ్మేస్తోంది. దీంతో చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

ప్రధాని బోరిస్ కు కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వ్యాధి ఎక్కువ అవుతుండడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

ప్రధాని పూర్తిగా కోలుకునే వరకూ ఫస్ట్ సెక్రటరీగా ఉన్న Dominic Raab బ్రిటన్ ప్రభుత్వ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బ్రిటన్‌లో కరోనా విజృంభించడంతో ఏడు వేలకు పైగా మృతి చెందారు. 60వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేసేందుకు బ్రిటన్ లాక్ డౌన్ విధించింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది. ఇప్పటికీ కరోనా కొత్త కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని భావిస్తోంది బ్రిటన్ మంత్రివర్గం.

ఏప్రిల్ 18 వరకు కరోనా వైరస్ తీవ్రత పీక్ స్టేజీలో ఉంటుంది.. ఈ 10 రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనిపై మంత్రివర్గంలో టెన్షన్లు మొదలయ్యాయి. కానీ, ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మే వరకు లాక్ డౌన్ పొడిగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసే ప్రసక్తే లేదన్నారు. 

Also Read | లాక్ డౌన్ పొడిగింపు… తెలంగాణతోపాటు మరో 8 రాష్ట్రాలు సుముఖత