సముద్రంపై హర్రర్ షో: కరోనా భయంతో వేలమంది బందీ ఇంకెన్నాళ్లు?

మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 12:52 PM IST
సముద్రంపై హర్రర్ షో: కరోనా భయంతో వేలమంది బందీ ఇంకెన్నాళ్లు?

Updated On : February 15, 2020 / 12:52 PM IST

మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ

మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ సోకూడదని వాళ్లను చిన్నచిన్న రూంలో బందీలను చేసి…వైద్యం చేస్తున్నారు. పక్క వాళ్లను చూస్తేనే అనుమానం. ఎప్పుడూ మాస్క్ తోనే ఉండాలి. అలాగని షిప్ దిగడానికి వీళ్లేదు. వైరస్ భయంతో బైటకు రానీయడం లేదు. ఇదేమీ కల్పన కాదు. వాస్తవం. 3,500 మంది ఉన్న Cruise Ship Diamond Princess ను జపాన్ తీరంలో దిగ్భందించారు. పదుల సంఖ్యలో ప్రయాణీకులకు కరోనా వైరస్ సోకడంతో ఎవరినీ బయటకు రానీయడం లేదు.  

నెగిటివ్ వస్తే బయటకు:
ఇప్పటికే 240 మందికి కరోనా వైరస్ సోకింది. వీళ్లను హాస్పటల్ కు తీసుకెళ్లారు. వీళ్లలో ఇప్పటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న 80ఏళ్ల సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వీళ్లను కిటికీలు లేని గదుల్లో ఉంచారు. వాళ్లకు కరోనా టెస్టుల్లో నెగిటివ్ వస్తే బయటకు పంపిస్తారు. షిప్ లో ఇప్పటికే వేల మంది ఉన్నారు. ఎక్కువ సమయంలో గదుల్లోనే ఉంటున్నారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు కొద్దిసేపు డెక్ మీద నడుస్తారు అంతే.

సముద్రం మీద హర్రర్ షో:
ప్రాణాంతకమైన వైరస్ వచ్చిందనగానే…అనుమానమున్న వాళ్లందరినీ నిర్బందించడం ఎంతవరకు సబబు? కొన్నిసార్లు వైరస్ బాధితుల దగ్గరకు ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకోవడం పని చేయొచ్చు. అంతేకాని, ఇలా క్రూయిజ్ షిప్ లో వేలమందిని నిర్భందించడం, కరోనా పూర్తిగా తగ్గే వరకు ఒక్కరినీ బైటకు రానివ్వకపోవడం మంచి కాకపోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇదో చెడ్డ నిర్ణయమంటున్నారు జాన్స్ హాప్క్నన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ వైరస్ వ్యాధుల నిపుణులు డాక్టర్ అమేష్ అడల్ జా. నౌకలోనే వేల మందిని బందీలు చేయడం క్రూరం, అమానుషం అన్నారు. సముద్రం మీద హర్రర్ షో గా అభివర్ణించారు.

కరోనా సోకితే దూరంగా బందీ చేయాల్సిందేనా? 
quarantineలో షిప్ ఉండి 10 రోజులైంది. వ్యాధి సోకని వాళ్లను కూడా అక్కడే దిగ్బంధించడంతో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. షిప్ లోని ప్రయాణీకులను జపాన్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చేసరికి కొన్ని వందల మందికి కరోనా సోకచ్చన్న భయం వైద్య నిపుణులది. తెలిసిన వైరస్ కు మందుంది. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ ల వ్యాప్తిని అడ్డుకోవాలంటే బాధితులను దూరంగా ఉంచడమే మంచిదన్నది మరికొందరి మాట. కరోనాకు మందు లేదు. వ్యాక్సిన్ తయారీకి నెలల సమయం పడుతుంది. అందుకే బాధితులను దూరంగా ఉంచి వైద్యం చేయడమే మంచిదని న్యూయార్క్ యూనివర్సిటీలోని న్యూరల్ సైన్స్, బయోలజీ ప్రొఫెస్ కరోల్ అంటున్నారు. quarantining పని చేయచ్చు, పని చేయకపోవచ్చు. ఈ చర్యలు కచ్చితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకొంటాయన్న నమ్మకం పూర్తిగా ఎవరికీ లేదు. కరోనా అంతుబట్టడం లేదు కాబట్టి దానికి దూరంగా ఉండాలన్న తపన తప్ప, ఇదేమీ వైరస్ ను అంతం చేసే టెక్నిక్ కాదని అంటున్నారు.

మరేం చేయాలి?
మొత్తం ప్రయాణీకులను చిన్న చిన్న గ్రూపులుగా విడదీసి, వాళ్లను వేర్వేరుగా quarantine చేయాలి. అంతేకాని వేలాది మంది పెద్ద క్రూయిజ్ షిప్ లో ఉంచడం చాలా ప్రమాదకరం. వైరస్ అలలుగా వ్యాపించడం ఖాయం. అప్పుడు ఎక్కువమందే ప్రమాదంలో పడతారు.

ఎంతకాలం ఈ బందీ?
అసలు ఎంతకాలం షిప్ ను quarantine చేయొచ్చు? బహుశా రెండు వారాలు. ఒక వైరస్ పుట్టి ఎదిగి చనిపోవడానికి పట్టే సమయం ఇదే. అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించి, రోగ లక్షణాలను చూపించడానికి పట్టే సమయం కూడా రెండు వారాలని Centers for Disease Control and Prevention (CDC) అంచనా. కరోనా విషయంలో రెండు మూడు రోజులు ఎక్కువ పట్టొచ్చు. కొన్ని వైరస్ లైతే 24 రోజులు పడతాయి. Diamond Princess షిప్ 14 రోజుల quarantineలో ఉంటుంది. అంటే ఫిబ్రవరి 19. కొత్తగా వైరస్ సోకిన వాళ్లు తప్ప మిగిలిన వాళ్లందరినీ ఆ తర్వాత బైటకు తీసుకొనిరావచ్చు.