జర్మనీలో తెరుచుకోనున్న షాపులు.. ‘బుండెస్లిగా’ లీగ్‌కు అనుమతి!

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 02:08 AM IST
జర్మనీలో తెరుచుకోనున్న షాపులు.. ‘బుండెస్లిగా’ లీగ్‌కు అనుమతి!

Updated On : May 7, 2020 / 2:08 AM IST

కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న జర్మనీ నెమ్మదిగా కరోనా ఆంక్షలను సడలించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంటిపక్కనే ఉన్న ఒకరి నుంచి ఇద్దరు కలుసుకోవడంతో పాటు షాపులను తిరిగి తెరవడం, ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్‌బాల్ లీగ్ ‘బుండెస్లిగా’ సీజన్ పున: ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడంపై జర్మనీ అధికార యంత్రాంగం యోచిస్తోంది. COVID-19 మహమ్మారి వ్యాప్తితో దేశంలో విధించిన నిబంధనల్లో సడలింపు ప్రకటించినట్టు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. మొదటి దశ నుంచి బయటపడ్డామని రెండో దశ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఆమె హెచ్చరించారు. 

తాజా సడలింపు ప్రకటనతో.. జర్మనీలో రెండు వేర్వేరు నివాసితులు ఒకరినొకరు కలుసుకోవడానికి అనుమతి ఉంటుంది. బుండెస్లిగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు మే చివరి భాగంలో జరుగనున్నాయి. అదనంగా శానిటైజ్ చర్యలతో మరిన్ని షాపులను తిరిగి తెరిచేందుకు అనుమతించనుంది. అంతేకాదు.. ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూనే ఉండాలని చెబుతోంది. ప్రజా రవాణాలో నోరు, ముక్కును కూడా తప్పకుండా మాస్క్‌లతో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ కొంతవరకు జర్మనీలో నియంత్రణలో ఉందని తాను నమ్ముతున్నానని, తొలి దశలో విజయవవంతమయ్యామని మెర్కెల్ అన్నారు. ఇక తర్వాతి దశలోనూ ప్రజలు సహకరించడంపైనే కరోనా కట్టడి ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కొంచెంద ధైర్యంతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 

COVID-19 వ్యాప్తితో దేశంలో 6,993 మరణాలను నమోదు అయ్యాయి. ఏప్రిల్ మధ్యలో చిన్న దుకాణాలను తిరిగి తెరవడానికి అనుమతినిచ్చారు. ప్రజా రవాణాలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేయడం ద్వారా తాత్కాలికంగా పరిమితులను సడలించడం ప్రభుత్వం ప్రారంభించింది. మార్చిలో ఆగిపోయిన బుండెస్లిగా ఫుట్‌బాల్ సీజన్‌ను తిరిగి ప్రారంభించడానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ ఈ వారంలో తేదీలను చర్చించే అవకాశం ఉంది. 

కరోనా వ్యాప్తి తరువాత తిరిగి ప్రారంభించిన ఐరోపాలోని 5 దేశీయ లీగ్‌లలో ఇది మొదటిదిగా చెప్పవచ్చు. కొన్నాళ్ల పాటు ఫుట్ బాల్ మ్యాచ్‌లను స్టేడియంలో ఫ్యాన్స్ లేకుండానే చూడాల్సి ఉంటుంది. ఈ ప్రకటన బుండెస్లిగా, 2వ బుండెస్లిగా విభాగాలకు శుభవార్త అని జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియన్ సీఫెర్ట్ ప్రకటించారు. ఆ తర్వాతే ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్ లను కొనసాగించడానికి ఏకైక మార్గమని ఆయన చెప్పారు. స్టేడియం ప్రేక్షకులు లేని ఆటలు ఎవరికీ అనువైన పరిష్కారం కాదన్నారు. ఇండోర్ మ్యాచ్ లు ఆడటమనేది పెద్ద సవాల్ అన్నారు. అయినప్పటికీ, ప్రేక్షకులను తిరిగి స్టేడియంలోకి అనుమతించే వరకు క్లబ్‌లు బుండెస్లిగాను విరామం ఇవ్వడానికి అనుమతించడం ఆర్థికంగా లాభదాయకం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read | ఫేస్‌ మాస్కుతోనే వైరస్‌ కనిపెట్టొచ్చు..!