సినిమాల్లో విలన్లగా కనిపించే మాఫియా గ్యాంగ్‌లు ఇటలీలో పేదలకు సాయం చేస్తున్నాయి. ఎందుకంటే?
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి మాఫియా ముఠాలు. 18,279 మరణాలను చూసిన దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. కొన్ని వారాలుగా డబ్బులు లేకుండా దిగ్బంధంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అవసరమైన వస్తువులు, ఉచిత ఆహారాన్ని మాఫియా ముఠాలు సరఫరా చేస్తున్నట్లు గార్డియన్ రిపోర్ట్ చేసింది. కాంపానియా, కాలాబ్రియా, సిసిలీ, పుగులియాలోని దక్షిణ ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు నిత్యవసరాలను ఇస్తున్నాయి.
దుకాణాలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, పబ్బులు మూసివేశారు. మిలియన్ల మంది ప్రజలకు నెలకు పైగా ఆదాయం లేదు. వారు ఎప్పుడు పనికి వెళ్తారో తెలియదు. ప్రజలకోసం ప్రభుత్వం షాపింగ్ వోచర్లు జారీ చేసింది.అవి సరిపోవు. ఈ కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే, మాఫియా హెల్పింగ్ హ్యాండ్ పేరుతో ప్రజలను కంట్రోల్ చేసే ప్రమాదముంది.
షాపుల దగ్గరకెళ్లి ఫ్రీగా ఫుడ్ ఇవ్వమని అడుగుతున్నారు. కాదంటే కొడుతున్నారు. ఇలాంటి వీడియోలు ఎక్కువవుతున్నాయి. మీకు ఫుడ్ కావాలంటే మా ముఠాల్లోచేరమని కుర్రాళ్లకు గ్యాంగ్‌స్టర్లు ఆఫర్లిస్తున్నారు.
నేపుల్స్‌లో కామోరా, నియాపోలిటన్ ప్రాంతాల్లో ఆహార పొట్లాలను ఇంటికే డెలివరి చేస్తున్నారు. అలాంటి వాళ్లమీద పోలీసుల నిఘా ఉంది. అసలు పేదలకు మాఫియా ఎందుకు సాయం చేస్తోంది? మాఫియా అంటే నేరసంస్థలు మాత్రమేకాదు. అవి ప్రాంతాలను, మార్కెట్లను పాలించాలని కోరుకునే నేర సంస్థలు. ఒక్కో ముఠాకు ఒక్కో ప్రాంతంమీద పట్టుంటుంది.
మాఫియాలు ఇచ్చేవి బహుమతులు కావు. వాళ్లేమీ దయామయులుకారు. ముఠాలకు ఆశ్రయమివ్వడం, అవసరమైనప్పుడు గ్యాంగ్‌లకు సాయం చేయడం, మాదకద్రవ్యాల సరఫరా ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తిరిగి చెల్లించాల్సిందే.
(కోవిడ్-19కు చికిత్స కోసం ఆరు ఔషధాలను గుర్తించిన శాస్త్రవేత్తలు)