క‌రోనా వైరస్‌కు వ్యాక్సిన్‌..ఎలుక‌ల‌పై ప‌రీక్ష‌లు

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 05:16 AM IST
క‌రోనా వైరస్‌కు వ్యాక్సిన్‌..ఎలుక‌ల‌పై ప‌రీక్ష‌లు

Updated On : February 11, 2020 / 5:16 AM IST

చైనాలో పుట్టీ..ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్న ‘కరోనా వైరస్’ కు వ్యాక్సిన్ కనిపెట్టామని వాటిని జంతువులపై ప్రయోగించినట్లు ఫిబ్రవరి 10,2020న news portal yicai.com ఒక నివేదికలో తెలిపింది.  అలాగే..కరోనా వైరస్ ను అరికట్టేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రాణాంతకంగా మారిన వైర‌స్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ త‌యారీ కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది.   నావెల్ క‌రోనా వైర‌స్‌ను అదుపులోకి తెచ్చేందుకు చైనాలోని ఇప్పటికే నిపుణులు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) శాఖ వ్యాక్సిన్ త‌యారీ కోసం జంతువుల‌పై ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు వార్త‌లు వెలుబ‌డ్డాయి.  ఎంఆర్ఎన్ఏ(mRNA) వ్యాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.  సీడీసీతో పాటు షాంఘైలో ఉన్న తోంగ్జీ  మెడికల్ యూనివర్శిటీ స్టెర్మిర్‌నా థెర‌పాటిక్స్ కంపెనీలు.. సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను జంతువుల‌పై ప‌రీక్షిస్తున్నాయి. 

దీంట్లో భాగంగా ఆదివారం ఫిబ్రవరి 9 వంద ఎలుకలకు ఈవ్యాక్సిన్ శ్యాంపిళ్ల‌ను ఇచ్చిన‌ట్లు చైనాకు చెందిన ప్ర‌ఖ్యాత వార్తా వెబ్‌సైట్ తెలిపింది. అయితే జంతువుల‌పై జ‌రుగుతున్న వ్యాక్సిన్ ప‌రీక్ష  ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉందని అధికారులు చెబుతున్నారు.  ఆ వ్యాక్సిన్‌ను మ‌నుషుల‌పై వాడడానికి ముందు ఇంకా పలు రకాల ప‌రీక్ష‌లు చేయాల్సి ఉందనీ..తెలిపారు. ఎలుక‌ల‌పై జ‌రుగుతున్న ప‌రీక్ష ఫస్ట్ స్టేజ్ లో మాత్రమే ఉందనీ..అనంతరం ఆ వ్యాక్సిన్‌కు ఎలుకలకంటే పెద్ద జంతువుల‌పైన‌ కూడా చేప‌ట్టాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు.

ఎలుక‌ల‌పై ప‌రీక్ష‌లు పూర్తి అయిన తరువాత కోతుల‌పై వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నామనీ..అనంతరం అది పూర్తిగా మంచి ఫలితాలు వస్తేనే ఆ వ్యాక్సిన్ సుర‌క్షిత‌మైన‌ద‌ని తేలితేనే..దాన్ని మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తార‌ని తోంగ్జీ వ‌ర్సిటీ పేర్కొంది.

సాంప్ర‌దాయ వ్యాక్సిన్ల‌ను త‌యారీ చేసే ప‌ద్ధ‌తి క‌న్నా త్వ‌ర‌గానే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌వ‌చ్చని నిపుణులు ఈ సందర్భంగా తెలిపారు. కాగా..ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగాలు మోగిస్తున్న కరోనా వైరస్ చైనాతో పాటు ప్ర‌పంచ‌దేశాల్లోని అనేక ప‌రిశోధ‌నా సంస్థ‌లు క‌రోనా నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ త‌యారీలో చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 10,2020) నాటికి సోమవారం చైనాలో 40,000 పైగా కేసులను నమోదైనట్లుగా  నిర్ధారించింది.