United Kingdom : రూ.42 లక్షల విలువైన చాక్లెట్లు దొంగతనం చేసి జైలు పాలైన దొంగ

ఒక దొంగ మామూలోడు కాదు.. 2 లక్షల చాక్లెట్లు దొంగతనం చేశాడు. వాటి విలువ లక్షల్లో. అంత కష్టపడి దొంగతనం చేసి పోలీసులకి చిక్కిపోయాడు.

United Kingdom :  రూ.42 లక్షల విలువైన చాక్లెట్లు దొంగతనం చేసి జైలు పాలైన దొంగ

United Kingdom

Updated On : July 23, 2023 / 2:17 PM IST

United Kingdom : దొంగతనాలు రకరకాలుగా ఉంటాయి. డబ్బు, నగలు, బట్టలు, వస్తువులే కాదు చాక్లెట్లు దొంగలు కూడా ఉన్నారు. చిన్న దొంగతనం అనుకునేరు 2 లక్షల చాక్లెట్లు కొట్టేశాడు. వాటి విలువ రూ.42 లక్షలట. ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందేగా.

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

యూకేలో జోబీ పూల్ అనే దొంగ 2 లక్షల క్యాడ్‌బరీ క్రీమ్ చాక్లెట్లు దొంగిలించాడు. వాటి విలువ రూ.42 లక్షలట. ఇది కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన అయినా రీసెంట్‌గా దోషిగా నిర్ధారించబడ్డాడు. ఫిబ్రవరి 11, 2023 లో ఒక చాక్లెట్ ఇండస్ట్రీ యూనిట్ నుండి చాక్లెట్లు దొంగిలించిన జోబీ పూల్‌‌కి 18 నెలల జైలు శిక్ష పడింది. ఈ చాక్లెట్లు చాలా ప్రజాదరణ ఉన్నవట.  జోబీ పూల్ యూనిట్‌లోకి ప్రవేశించి చాలా చాకచక్యంగా చాక్లెట్లను దొంగిలించి వాటిని లారీలో తీసుకెళ్లాడట. పోలీసులకు సమాచారం అందడంతో లారీతో సహా అతడిని పట్టుకున్నారు. ష్రూస్ బరీ క్రౌన్ కోర్టులో న్యాయమూర్తి అంథోనీ లోవ్ శిక్ష విధించారు. ఇప్పటికే అతను 6 నెలలుగా కస్టడీలో ఉన్నాడు. 18 నెలలో 6 నెలలు తీసివేస్తే మిగిలిన కాలం అతను జైలు జీవితం గడపాలి.

Kondagattu Anjaneyaswamy Temple Robbery : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనం.. గర్భగుడిలోని విలువైన వస్తువులు, విగ్రహాలు చోరీ

ఇక జోబీ పూల్‌ని పట్టుకున్నట్లు వెస్ట్ మెర్సియా పోలీసులు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మొత్తానికి చాక్లెట్ దొంగ పోలీసుల నుండి తప్పించుకోలేకపోయాడు.