కరోనాకు మందు దొరికేసిందటున్న ఫ్రెంచ్ రీసెర్చర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం ముంచెత్తుతుంది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న ఫ్రెంచ్ రీసెర్చర్లు తొలి ప్రయోగం సక్సెస్ అయిందని చెబుతున్నారు. అంతకంటే ముందు చేసిన ప్రయోగంలో ఆరు రోజుల్లోనే ఈ వైరస్ ను అరికట్టవచ్చని తేలింది. కానెక్సియోన్‌ఫ్రాన్స్.కామ్ ఆధారంగా ప్రొఫెసర్ డిడియర్ రౌల్ట్ వారు చేసిన ప్రయోగం సక్సెస్ అయిన విధానాన్ని వివరించారు.
కరోనా వైరస్ గురించి ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రీసెర్చ్ చేసిన వ్యక్తుల్లో రౌల్ట్ ఒకరు. ముందుగా ఆయన క్లోరోక్విన్ వాడటంతో వైరస్ తగ్గు ముఖం పట్టినట్లు గుర్తించారు. ఒకేసారి కాకపోయినా క్రమంగా తగ్గినట్లు చెప్పారు. నిజానికి క్లోరోక్విన్ మలేరియా నయం చేయడానికి వాడతారు. దానిని ప్లాక్వినిల్‌తో కలిపి రోగులకు ఇస్తారు.
మేం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రెండు నగరాలను పర్యవేక్షించి కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి ట్రీట్‌మెంట్ ఇచ్చాం. మీడియా కథనం ప్రకారం.. 24మందికి వైద్యం అందించారు. పది రోజుల పాటు రోజుకు 600mcg మందు ఇస్తూ వచ్చాం. దగ్గర నుంచి మానిటరింగ్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
మరికొందరు పేషెంట్లకు హైడ్రాక్సిక్లోరోక్విన్ (hydroxychloroquine) ఉన్న ప్లాక్వినిల్(Chloroquine phosphate) మందు ఇవ్వకుండా ట్రీట్ చేశాం. వారి పరిస్థితి ఆరు రోజులు గడిచినా ఇంకా విషమంగానే ఉంది. కేవలం 25శాతం మంది మాత్రమే కోలుకున్నారు. క్లోరోక్విన్ ఫాస్పేట్(Chloroquine phosphate), హైడ్రాక్సిక్లోరోక్విన్ (hydroxychloroquine)లు కరోనా పేషెంట్లను ట్రీట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.
అమెరికాకు చెందిన కలెట్రా(kaletra)యాంటీ వైరల్ డ్రగ్ హెచ్ఐవీకి వాడే మందు కూడా ఈ ప్రాణాంతక వైరస్ నుంచి కాపాడగలిగేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో ప్రూవ్ చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.