స్విట్జర్లాండ్ మంచుకొండ ఆసాంతం త్రివర్ణ పతాకం

స్విట్జర్లాండ్ మంచుకొండ ఆసాంతం త్రివర్ణ పతాకం

Updated On : April 18, 2020 / 7:46 AM IST

స్విట్జర్లాండ్.. కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో భారత్‌తో కలిసే ఉన్నామని సింబాలిక్ గా తెలియజేసింది. అక్కడి మంచుకొండలపై త్రివర్ణ పతాకం ప్రతిబింబించేలా లైట్ బీమ్ ఏర్పాటు చేసింది. స్విస్ ఆల్ఫ్స్‌లోని మ్యాటర్ హార్న్ పర్వతాలపై ఎన్నడూ లేనంత పెద్దగా భారత జాతీయ జెండా కనిపించేలా చేసింది. వాటిని జెనీవాలో ఉంటున్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ గుర్లీన్ కౌర్ ఫొటో తీసి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 

ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయాందోళనలో మునిగిపోయి ఉంటే స్విట్జర్లాండ్ సందేశాలతో ప్రపంచానికి ఆశను, ప్రేమను పెరిగేలా చేస్తుంది. ప్రతి రోజూ సాయంత్రం 4వేల 478మీటర్లు(14వేల 692 అడుగులు) ఎత్తు జాతీయ చిహ్నాన్ని.. ఉంచి ప్రజల్లో ఐక్యతా భావం పెరిగేలా చేస్తుంది. లైట్ ప్రొజెక్షన్లు దాదాపు 800మీటర్ల ఎత్తుగా ఉండి కొద్ది వారాల నుంచి కనిపిస్తున్నాయి. స్విట్జర్లాండ్-ఇటలీ సరిహద్దులో పర్వతాలపై వెలుగుతున్న త్రివర్ణ పతాకం 4కిలోమీటర్ల దూరం వరకూ దర్శనమిస్తుంది. 

స్విస్ పతాకంతో మొదలుపెట్టాం. ఎందుకంటే మా జాతీయ పతాకంతో అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వాటిని ఆశ, నమ్మకం, ఇంట్లోనే ఉండడం వంటి పదాలతో అందరిలో నమ్మకం పుట్టిస్తున్నాం. తెల్లని బ్యాక్ గ్రౌండ్ మీద రెడ్ కలర్లో హార్ట్ సింబల్ ఉంచి స్విస్ జాతీయ పతాక రంగులు ప్రతిబింబించేలా చేస్తున్నారు. 

బుధవారం రాత్రి స్విట్జర్లాండ్, ఇటలీ జాతీయ పతాకాలు కూడా దర్శనమిచ్చాడు. ఇండియాతో పాటు అమెరికా, జర్మనీ, స్పెయిన్, యూకే, జపాన్ జాతీయపతాకాలు పర్వతాలపై కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. చరిత్రను చూస్తే రెండు, మూడు, నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పుడు.. మనల్ని అందరినీ కలిపింది కేవలం కళ మాత్రమే. మరోసారి భవిష్యత్ లో పుంజుకోగలమనే నమ్మకం నింపింది కళే. అది మాత్రమే ఆశను నింపగలదని నిర్వహకులు అంటున్నారు. 

Also Read | ఏపీలో క్వారంటైన్ ఏర్పాట్లు సూపర్బ్..మెచ్చుకున్న బ్రిటన్ ప్రోఫెసర్