Covid 19 Vaccine Clinic Hosted At Hindu Temple In Chino Hills
COVID-19 Vaccine Clinic : చినో హిల్స్‌లోని ఇన్‌ల్యాండ్ ఎంపైర్‌లో హిందూ దేవాలయం వద్ద కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్ ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఈ దేవాలయానికి సంబంధించి 21ఎకరాల ప్రాంగణంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. BAPS చారిటీ సంస్థతో కలిసి ఆషీ పటేల్ కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహమ్మారి కాలంలో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై సలహాలు, సూచనలు చేస్తున్నారు.
వైట్ హౌస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కోవిడ్-19 కమ్యూనిటీ కార్పొరేషన్ లో BAPS సంస్థకు ఒక సభ్యుతం కూడా ఉంది. వాల్ మార్ట్ భాగస్వామ్యంతో ఫైజర్ వ్యాక్సిన్ ఈ దేవాలయంలోకి తీసుకొచ్చారు. లాస్ ఏంజెల్స్ నుంచి బెన్నీ కార్డెనాస్ ఈ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తొలి డోస్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో భాగంగా క్లినిక్ నుంచి 500 మందికి వ్యాక్సిన్ అందించారు. భవిష్యత్తులోనూ ఈ దేవాలయాన్ని వ్యాక్సిన్ క్లినిక్‌గా సేవలందించనున్నట్టు సంస్థ పేర్కొంది. కాలిఫోర్నియాలో 16ఏళ్లు ఆపై అందరికి వ్యాక్సిన్ అందించేందుకు అనుమతినిచ్చింది.