Australia Event: క్రికెట్ కలిపింది ఇద్దరినీ.. ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ

మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు.

Australia Event: క్రికెట్ కలిపింది ఇద్దరినీ.. ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ

Updated On : May 23, 2023 / 4:40 PM IST

PM Modi: భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని క్రికెట్ పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. క్రికెట్‭తో పాటు మస్టర్ చెఫ్ సైతం రెండు దేశాల మద్య సంబంధాల ఏర్పాటుకు దోహదం చేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తుతం మూడు రోజుల ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన సోమ‌వారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. అనంతరం, మంగళవారం సిడ్నీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‭తో కలిసి పాల్గొన్నారు.

Arvind Kejriwal: మనీష్ సిసోడియా పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ సీఎం

సిడ్నీలోని ఖుడోస్ బ్యాంక్ ఎరీనాలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్టేడియం ఆవరణలో ఇరువురు నేతలకు (మోదీ, అబ్జనీ) అక్కడి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ మాట్లాడుతూ “మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు. కానీ మాస్టర్‌చెఫ్ కూడా మనల్ని కలుపుతుంది” అని అన్నారు.

The Kerala Story: క్రూరమైన నిజం బయట పడిందట.. ఆ సినిమా చూసిన అనంతరం గవర్నర్ రవి

రెండు దేశాల మధ్య సంబంధాలను 3-C, 3-D, 3-E లుగా మోదీ వర్ణించారు. 3-C అంటే కామన్వెల్త్, క్రికెట్, కర్రీ.. 3D అంటే డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ.. 3E అంటే ఎనర్జీ(ఇంధనం), ఎకానమీ(ఆర్థిక వ్యవస్థ), ఎడ్యూకేషన్(విద్య). ఇవన్నీ పరస్పర విశ్వాసం, గౌరవం మీద ఆధారపడి ఉన్నాయని ప్రధాని నొక్కిచెప్పారు. బ్రిస్బేన్‌లో త్వరలో భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, ఇరువురు నేతల్ని అక్కడికి వచ్చినవారు సెల్ఫీల్లో ముంచెత్తారు.