హలో..ఓపెన్ ద డోర్ : ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టిన మొసలి

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 04:07 AM IST
హలో..ఓపెన్ ద డోర్ : ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టిన మొసలి

Updated On : May 8, 2019 / 4:07 AM IST

మీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది అంటే ఎవరు వచ్చారా అనుకుంటాం.. పేపర్ వాడో.. పాలవాడో లేదా బంధువులో.. లేదా స్నేహితులో అనుకుంటాం.  కాలింగ్ బెల్ మోగింది కదాని గబగబా వచ్చి తలుపు తీయొద్దండోయ్.. అదేంటి కాలింగ్ బెల్ మోగితే తలుపు తీయకుండా ఎలా ఉంటాం అనుకుంటున్నారా.. కానీ మీ ఇంటి బెల్ కొట్టింది తెలిసివారో లేక తెలియనివారో అయితే ఫరవాలేదు.. సమాధానంచెప్పి పంపేయొచ్చు.. కానీ ఆ బెల్ మోగించింది మనిషి కాకుండా మరేదైనా అయితే? తస్మాత్ జాగ్రత్త.. ఏంటి భయపెట్టేస్తున్నాం అనుకుంటున్నారా? కాదండీ..  ముందు జాగ్రత్తగా చెబుతున్నాం. ఇదిగో ఇటువంటి భయపడే ఘటన జరిగింది కాబట్టే ముందుగా జర భద్రం అని చెప్పటంలో తప్పులేదు.. అసలు విషయం ఏంటంటే.. 

ఓ మొసలు ఓ ఇంటికి వచ్చి దర్జాగా కాలింగ్ బెల్ కొట్టింది. ఏంటి నమ్మరా? ఈ వీడియో చూస్తే మీరే నమ్ముతారు. ఈ విచిత్ర ఘటన యూఎస్‌లోని సౌత్ కరోలినాలో చోటు చేసుకున్నది. కరెన్ అల్ఫానో అనే మహిళ ఇంటి ముందుకు వచ్చిన మొసలి  డోర్ బెల్ మోగించింది. డోర్ బెల్ కొట్టేందుకు ఆ మకర రాజం ఎంతగా తిప్పలు పడిందో పాపం.  ఆరున్నర అడుగులు ఉంది ఆ మొసలి.

కాలింగ్ బెల్ సౌండ్ విని గబగబా వచ్చిన సదరు మహిళ వచ్చిది ఎవరా అని.. కిటికి నుంచి చూసింది. విస్తుపోయింది. కాలింగ్ బెల్ మోగించింది మనిషి కాదు.. మొసలి అని తెలుసుకొని షాక్ అయింది. వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు. అప్పటినుంచి కాలింగ్ బెల్ సౌండ్ వింటే చాలు ఆమె హడలిపోతోంది. ఆ మొసలి డోర్ బెల్ మోగించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.