Cute Baby Aunt Hug: ఆంటీని హగ్ చేసుకోవటానికి సెక్యూరిటీని పర్మిషన్ అడిగిన పసిపాప..సో క్యూట్ అంటూ నెటిజన్స్ ఫిదా
ఎయిర్ పోర్టులో తన ఆంటీని హగ్ చేసుకోవటానికి ఓ పాల బుగ్గల చిన్నారి సెక్యూరిటీ సిబ్బంది పర్మిషన్ అడుగుతున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

So Cute Baby Aunt Hug
Cute Baby Viral Video: చంటిపిల్లల్ని చూసినా..వారితో ఆడుకున్నా..వారిని ఎత్తుకు హృదయానికి హత్తు కున్నా..మనలో ఉన్నఒత్తిడి అంతా హుష్ కాకిలో ఎగిరిపోతుంది. అమ్మా అన్నా..ఆంటీ అంటూ చంటిపాప మన దగ్గరకొస్తే..ఎత్తుకోమని ఏడిస్తే..మారాం చేస్తే..మనం ఒక్కక్షణం కూడా ఆగలేం కదూ..అటువంటిది ఓ పాలబుగ్గ పసిపాప..మా ఆంటీని హగ్ చేసుకోవాలి..అన్నట్లుగా సెక్యూరిటీ గార్డును అడిగితే ఇక వాళ్లు నోరెత్తగలా?వద్దను అలా వెళ్లకూడదు పాపా అని అనగలరా?అనలేరు ..అదే జరిగింది ఓ ఎయిర్ పోర్టులో. ఎయిర్ పోర్టులో తన ఆంటీని హగ్ చేసుకోవటానికి ఓ పాల బుగ్గల చిన్నారి సెక్యూరిటీ సిబ్బంది పర్మిషన్ అడుగుతున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారంతా..అబ్బా పాప ఎంత ముద్దుగా ఉందో అటువంటి పాప అడిగితే పర్మిషన్ ఏంటీ ప్రాణాలే ఇచ్చేస్తాం అన్నట్లుగా ఉందీ వీడియో…
ఖతర్‌లోని హమద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన ఆ చిన్నారి ఆంటీకోసం పడిన తపన..సెక్యూరిటీ గార్డుల దాకా వెళ్లి..అక్కడ నుంచి నేను లోపలికి వెళ్లకూడదేమోనని సందేహంతో సెక్యూరిటీ వంక చూసిన తీరు వాహ్ అనిపిస్తోంది. ఈ చిన్నారిని విడిచిపెట్టి ఓ మహిళ విమానం ఎక్కటానికి వెళ్లింది. ఇంతలో మన క్యూట్ బేబీ ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లి.. తన ఆంటీ దగ్గరకు వెళ్లేందుకు పర్మీషన్ కావాలని సైగలతో అడుగుతుంది.
Read more : Cute Video : బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో కోతిపిల్ల ఆటలు..సో క్యూట్
వెంటనే సెక్యూరిటీ చెక్ పాయింట్‌ను దాటుకుని తన ఆంటీ వైపు పరుగులు తీస్తుంది. విమానం ఎక్కేందుకు వెళ్తున్న మహిళ కూడా.. ఆ చిన్నారి వైపు పరుగున వచ్చి హృదయానికి హత్తుకుంటుంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ చిన్నారి వైపు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోచూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఈ క్యూట్ వీడియో ఎంతో నచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. పాల బుగ్గల చిన్నారి..ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టడం లేదని..ఆ పసిపాపకు అప్పుడే అన్ని విషయాలు ఎలా తెలిసిపోయాయబ్బా అంటున్నారు.
She asked the officer permission to say goodbye to her aunt at the airport. pic.twitter.com/bcsb9rnxt6
— Kaptan Hindustan™ (@KaptanHindostan) October 14, 2021