Cyclone Jawad, The Name Given By Saudi Arabia
Cyclone Jawad, The Name Given by Saudi Arabia : బంగాళాఖాతంలో మరో కొత్త తుపాను తయారవుతోంది. ఈ తుపాను పురుడుపోసుకుంటున్న సమయంలోనే దానికి పేరు కూడా నిర్ణయించేశారు ‘జవాద్’ అని. తుపానులకు పేర్లు పెట్టటం గత కొంతకాలంనుంచి జరుగుతోంది. ఈక్రమంలో బంగాళాఖాతంలో పురుడు పోసుకునే తుఫానుకు ‘జవాద్’అని పేరు పెట్టటానికి సిద్ధమయ్యారు. బిడ్డలు పుట్టాక పేర్లు నిర్ణయించి పెడతారు. కానీ ట్రెంట్ మారింది. పిల్లలు గర్భంలో ఉండగానే పేర్ల కోసం తల్లిదండ్రులు ఆలోచించేస్తున్నారు. ఇదిలా ఉంటే తుపాన్లకు కూడా పేర్లు పెడుతున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో అండమాన్ వద్ద సముద్రంలో ‘జవాద్’ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.
Read more : IMD : దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ఎఫెక్ట్ ?
అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపానుగా మారితే దీనిని ‘జవాద్’ అని పిలవనున్నారు.ఇది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం గణనీయంగా ఏపీ, ఒడిశాలపై ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, ‘జవాద్’ అనే పేరును సౌదీ అరేబియా సూచించింది. అరబిక్ భాషలో ‘జవాద్’ అంటే గొప్పది,’ఉదార’, ‘దయగల’ అనిఅర్థాలున్నాయి.
కాగా పలు జిల్లాల్లో వర్షాలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ముప్పు తప్పింది అనుకుంటే మరో తుపాను దూసుకురావటానికి బంగాళఖాతంలో పురుడు పోసుకుంటోంది. అది వాయుగుండం కాస్తా తుపానుగా మారితే దానికి ‘జవాద్’తుపానుగా నామకరణం చేశారు. అంటే పురుడు పోసుకోకముందే తుపానుకు నామకరణం చేసేశారు. అదే గనుక తుపాన్ గా మారితే ఏపీనే టార్గెట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రంలోకి నేడు ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దీనికి ‘జవాద్’అని పేరు పెట్టనున్నారు.
Read more : CM Stalin : మహిళా ఎస్ఐపై సీఎం స్టాలిన్ ప్రశంసలు