ఘోర రోడ్డు ప్రమాదం : 35మంది యాత్రికులు మృతి
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 35మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఈ ప్రమాదం జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ సెంటర్ గ్గర బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు.
ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు తెలిపారు. గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
పవిత్ర క్షేత్రం మక్కా సమీపంలో బుధవారం(అక్టోబర్ 16,2019) రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్ అరబిక్ పౌరులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.