Pet Dogs : రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించిన కోర్టు

మనుషులకు మరణశిక్ష విధించారనే వార్తలు తరచుగా వస్తుంటాయి. పెద్ద నేరం చేసిన వ్యక్తులకు కోర్టులు మరణశిక్ష విదిస్తాయి. అయితే ఓ దేశం మాత్రం కుక్కలకు మరణశిక్ష విధించింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. పాకిస్థాన్ లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు.

Pet Dogs : రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించిన కోర్టు

Pet Dogs

Updated On : July 13, 2021 / 3:18 PM IST

Pet Dogs : మనుషులకు మరణశిక్ష విధించారనే వార్తలు తరచుగా వస్తుంటాయి. పెద్ద నేరం చేసిన వ్యక్తులకు కోర్టులు మరణశిక్ష విదిస్తాయి. అయితే ఓ దేశం మాత్రం కుక్కలకు మరణశిక్ష విధించింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. పాకిస్థాన్ లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు. దీనికి కారణం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే..

వివరాల్లోకి వెళితే కరాచీకి చెందిన మీర్జా అక్తర్ అనే లాయర్ మార్నింగ్ వాక్ నిమిత్తం బయటకు వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రెండు కుక్కలు అతడిపై ఎగబడి దాడి చేశాయి. ఈ దాడులో సదరు లాయర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటిని కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ మారాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక అక్తర్ లాయర్ కావడంతో అతను కోర్టుకు వెళ్లాడు. అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్ ఖాన్‌ రాజీకి వచ్చాడు. లాయర్ అక్తర్ రాజీకి అంగీకరిస్తూనే పలు షరతులు పెట్టాడు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లోనే పెంచుకోవాలని.. తనపై దాడి చేసిన కుక్కలను వెంటనే వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని షరతులు విధించారు. ఇక ఈ ఒప్పందం కుక్కల యజమానికి కూడా నచ్చడంతో ఇద్దరు సంతకాలు చేశారు. కుక్కలకు మరణశిక్ష విధించడంపై నెటిజన్లు పడుతున్నారు.