Delta Airlines: బాబోయ్.. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి బోల్తాకొట్టిన విమానం.. అందులో 80మంది ప్రయాణికులు.. వీడియో వైరల్
కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం అదుపు తప్పి బోల్తాకొట్టింది..

Delta Airlines plane
Delta Airlines: ఇటీవలి కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ల్యాండింగ్ సమయంలోనూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదాలకు గురవుతున్నాయి. గత నెలలో వాషింగ్టన్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్, ఓ విమానం ఢీకొని 64 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. కెనడాలోని టొరంటో పియర్ సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ప్రమాదానికి గురైంది.
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి పల్టీలు కొట్టి విమానం తిరగబడింది. ఈ ఘటనలో 18మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైంది డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. అమెరికాలోని మిన్నెపొలిస్ నుంచి కెనడాలోని టొరంటో పియర్ సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 80మంది ప్రయాణికులు ఉన్నారు. 18మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా.. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు.
విమానం అదుపుతప్పి తిరగబడిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ల్యాండ్ అవుతున్న సమయంలో బలమైన గాలుల వల్లనే ఈ ప్రమదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. తిరగబడిన విమానంలో నుంచి ప్రయాణీకులను బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Delta flight carrying around 80 passengers crash lands at Toronto Pearson Airport.
No casualties reported at this time.
pic.twitter.com/JRIb7wkmJ8— Pop Crave (@PopCrave) February 17, 2025