ఈ డివైజ్ ద్వారా లగ్జరీ కార్లను ఈజీగా Unlock చేయొచ్చు!

  • Publish Date - February 17, 2020 / 09:35 PM IST

ఇలాంటి డివైజ్ మీ దగ్గర ఉంటేచాలు..  ఎలాంటి లగ్జరీ కార్లు అయినా సరే.. ఇట్టే అన్ లాక్ చేసేయొచ్చు. వైర్ లెస్ కీ ఫోబ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ డివైజ్‌ను ఎవన్ కనెక్ట్ అనే హ్యాకర్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎవరైనా సరే ఈజీగా లగ్జరీ కార్లను అన్ లాక్ చేయొచ్చునని అంటున్నాడు. డివైజ్‌కు ‘కీలెస్ రీపీటర్’ అనే పేరు పెట్టాడు. 9వేల డాలర్లకు విక్రయించనున్నట్టు చెబుతున్నాడు.

ఇంతకీ ఈ డివైజ్ ఎలా వర్క్ చేస్తుందో కూడా ఒక డెమో వీడియోను కూడా రికార్డు చేసి పెట్టాడు. ఆ వీడియోలో హ్యాకర్.. తన ఫ్రెండ్ అనుమతి తీసుకుని అతడి లగ్జరీ కారును అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించాడు. చేతులత్తో పట్టుకునేలా ఉన్న డివైజ్ యాంటినాతో కారులోని డ్రైవర్ సైడ్ డోర్ ను అన్ లాక్ చేశాడు. అంతేకాదు.. ఇంజిన్ కూడా స్టార్ట్ చేయడం వీడియోలో చూడొచ్చు. తన దగ్గర డివైజ్ కొనుగోలు చేసిన కస్టమర్లు దీన్ని ఎలా వినియోగిస్తారు అనేదానిపై తాను గ్యారెంటీ ఇవ్వలేనన్నాడు. 

తన డివైజ్.. 22, 40Khz ప్రీక్వెన్సీ మధ్య ఉండి, 2014 తర్వాత మార్కెట్లోకి వచ్చిన Mercedes, Audi, Porsche, Bentley and Rolls Royce కార్ల మోడల్ మినహా అన్ని లగ్జరీ కార్లలో వర్క్ అవుతుందని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ డివైజ్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్ కూడా ఉందని, దీని ధర 12వేల డాలర్లకు విక్రయించనున్నట్టు తెలిపాడు. ఈ డివైజ్ ద్వారా వైర్ లెస్ ఫోబ్ సిస్టమ్ సాయంతో ఏదైనా కారును అన్ లాక్ చేయొచ్చునని తెలిపాడు. 

ఈ టెక్నాలజీతో ఇప్పటివరకూ తాను ఏ కారును దొంగతనం చేయలేదన్నాడు. తాను అలా చూడలేదన్నాడు. డివైజ్ క్రియేట్ చేసి ఆయా టూల్స్ ఇతరులకు అమ్మడం మాత్రమే తాను చేస్తున్నట్టు చెప్పాడు. ఎవాన్ కనెక్ట్ వీడియోను సమీక్షించిన తర్వాత సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ వైస్ సామి కమ్కర్ మాట్లాడుతూ.. కీలెస్ రీపీటర్ టెక్నాలజీ సాధారణంగా తెలిసిందే అని చెప్పారు. ‘వీడియో చట్టబద్ధమైనదని నేను ధృవీకరించలేను. ఇది 100 శాతం సహేతుకమైనదని మాత్రం చెప్పగలను’ అని కమ్కర్ తెలిపారు.