కరోనా రోగులను రక్షించే తొలి కొవిడ్-19 మందు ఇదొక్కటే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. కరోనా వైరస్ చికిత్సలో ఎన్నో రకాల ఔషధాలను వాడుతున్నారు. కానీ, చౌకైనా ధరకే అందుబాటులో ఉన్న ఓ డ్రగ్ మాత్రం కరోనా చికిత్సలో అద్భుతంగా పని చేస్తుందని అంటున్నారు.
కొవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో నూతన అధ్యయనం మొదలైందనే చెప్పాలి.కరోనా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే మందుల్లో ప్రాణాపాయం నుంచి రక్షించే మందును మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసు నుంచి ఈ డ్రగ్ వస్తోంది. కరోనా సోకిన రోగుల్లో తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే.. వారికి ఈ డ్రగ్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడువచ్చునని చెబుతున్నారు.
ప్రాణాంతక కరోనాతో పోరాడుతున్న రోగుల్లో తక్కువ మోతాదులో స్టెరాయిడ్ చికిత్స ద్వారా నయం చేయవచ్చునని యూకే నిపుణులు అంటున్నారు. వెంటిలేటర్లపై ఉన్న మూడో వంతు రోగుల్లో ప్రాణాలను రక్షించవచ్చునని చెబుతున్నారు. ఆక్సీజన్ అవసరమైన రోగుల్లో కూడా ఐదో వంతు మరణాలను తగ్గించవచ్చునని స్పష్టం చేశారు.
ఇంతకీ ఆ డ్రగ్ పేరు ఏంటంటే?… dexamethasone డ్రగ్.. ఇప్పటికే ఎన్నో చికిత్సలలో ట్రయల్ టెస్టింగ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్ టెస్టింగ్ డ్రగ్ గా పేరొంది. అంతేకాదు.. ఈ డ్రగ్ వాడితే కరోనా వైరస్ నుంచి కూడా రక్షిస్తుందని పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు.
యూకేలో కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి సోకిన రోగులకు ఇచ్చిన చికిత్సలో dexamethasone డ్రగ్ ఇచ్చినట్టయితే వారిలో 5వేల మంది వరకు ప్రాణాలను రక్షించగలమని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే… ఈ డ్రగ్ చాలా చౌకగా లభ్యం అవుతోంది. కొవిడ్-19 రోగులు పెరిగిన పేద దేశాల్లో వారికి ఈ డ్రగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
మార్టిన్ లాండ్రే అనే కొలిగ్స్ ఈ డ్రగ్ తయారు చేశారు. dexamethasone అనే స్టీరాయిడ్ మెడిసిన్ 6 మిల్లీ గ్రాములను పది రోజుల వరకు ఇచ్చినట్టయితే కరోనా మరణాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. 2వేల 100 మందికి ఈ మెడిసిన్ ఇచ్చారు.. మరో నాలుగు వేల మందికి ఈ dexamethasone లేకుండా ఇచ్చి పరీక్షించారు. వీరిలో dexamethasone మెడిసిన్ ఇచ్చినవారికి అధ్భుతమైన ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తేల్చారు.