వారం రోజులుగా గూగుల్ లో ఏం వెతికారో తెలుసా?

గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం జనాభా ఏం వెతుకున్నారో తెలుసా? కొత్తగా వ్యాపారం ఆరంభించడం ఎలా అని.. అవునండీ… దుస్తులు శుభ్రం చేయడం, సరకుల సంపిణీ, ఫోటోగ్రఫీ వంటి వాటిల్లో అడుగుపెట్టి ఆదాయం ఎలా సంపాదించాలా అని తెలుసుకుంటున్నారట. సెర్చింజిన్ దిగ్గజం టూగుల్ తాజా ట్రెండ్స్ ను విడుదల చేసింది.
కరోనా వైరస్ కారణంగా ఉపాధి దొరక్కపోవడం, ఉద్యోగాల్లో కోత విధించడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం అదనంగా చిన్న చిన్న వ్యాపారాలు ఆరంభించాలనే ధోరణి పెరిగిందని తెలుస్తోంది. ఇక మరికొందరేమో స్థానిక వ్యాపారాలకు మద్ధతునివ్వడం గురించి శోధించారు. 30 రోజుల నుంచి తమ సమీపంలో నల్ల జాతీయులు, మహిళలు, మైనార్టీలు నిర్వహించే వ్యాపారాల గురించి ఆరా తీశారు.