Doctor prescription Viral : గొంతు నొప్పికి ప్రిస్క్రిప్షన్‌లో ఐస్‌క్రీం, వీడియో గేమ్? ఉద్యోగం పోగొట్టుకున్న డాక్టర్
బ్రెజిలియన్ డాక్టర్ చిన్నారికి ఇచ్చే ట్రీట్మెంట్ విషయంలో వింతగా ప్రవర్తించాడు. గొంతునొప్పితో వచ్చిన చిన్నారికి ఐస్‌క్రీం, వీడియో గేమ్ ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఇతని ప్రిస్క్రిప్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Doctor prescription Viral
Viral News : గొంతు నొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళ్తే చల్లని పదార్ధాలు తినొద్దని సూచిస్తారు. కానీ ఓ డాక్టర్ అందుకు భిన్నంగా ఓ చిన్నారికి ఐస్‌క్రీం, వీడియో గేమ్‌లు ప్రిస్క్రిప్షన్‌లో రాసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
People wash dishes with mud : ప్లేట్లను ఇలా కూడా శుభ్రం చేస్తారా? వింత వీడియో చూసి నవ్వుకుంటున్న జనం
గ్రేటర్ సావో పాలోలోని ఒసాస్కోకు చెందిన 37 ఏళ్ల రామోస్ అనే మహిళ తన 9 సంవత్సరాల చిన్నారిని ప్రభుత్వ యాజమాన్యంలోని క్లినిక్‌కు చెకప్ కోసం తీసుకెళ్లింది. చిన్నారి వాంతులు చేసుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గొంతు నొప్పి ఫ్లూ లక్షణాలతో ఉన్న చిన్నారికి అక్కడి బ్రెజిలియన్ డాక్టర్ చాక్లెట్ ఐస్ క్రీం మరియు వీడియో గేమ్ సూచించాడు. అమోక్సిసిలిన్, ఇబుప్రోఫెన్, డిపైరోన్, ప్రెడ్నిసోలోన్ మరియు ఎన్-ఎసిటైల్‌సైస్టైన్ వంటి మందులతో పాటు ఐస్ క్రీం మరియు రోజువారీ గేమింగ్ సెషన్‌లు కూడా అందులో రాశాడు.
Alligator Gar Fish : బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో.. వలకు చిక్కిన వింత చేప, అచ్చం మొసలిలా ఉంది
ఇక డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్‌పై చిన్నారి తల్లి రామోస్ మండిపడింది. ఐస్ క్రీం ఇష్టమా? చాక్లెటా? స్ట్రాబెర్రీనా? అని తన కొడుకుని అడిగాడని అందుకు తన కొడుకు చాక్లెట్ అని చెప్పగానే ప్రిస్క్రిప్షన్ పై అదే రాశాడని.. వీడియో గేమ్ రోజువారి సెషన్లను సూచించాడని ఆమె చెప్పింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు అవి అవి వృత్తిపరమైనవి కాదని అంటూనే అతను ప్రిస్క్రిప్షన్‌లో ఐస్‌క్రీం మరియు గేమింగ్‌ను జోక్‌గా మాత్రమే రాసి ఉంటాడని వాదించారు. దురదృష్టవశాత్తు డాక్టర్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ప్రిస్క్రిప్షన్ పై ఎలాంటి వివరణ ఇస్తాడో మరి.