డాక్టర్ల అల్ప సంతోషం.. పెళ్లి బట్టలకు బదులు చెత్త సంచులతో

ప్రస్తుత సమయంలో డాక్టర్లే సూపర్ హీరోలు. వేల కొద్దీ హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు కుటుంబాలను వదిలేసి హాస్పిటళ్లలోనే గడిపేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని హాస్పిటల్లో ఎమర్జెన్సీ డాక్టర్లుగా సేవలు అందిస్తున్న మ్యాక్స్, గ్రెటాలు ఆదివారం పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, పని ఒత్తిడిలో ఉండి, పేషెంట్లతో బిజీగా ఉండి పెళ్లి చేసుకోవడం కుదరలేదు. వారిద్దరూ కలిసి ఇనిస్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.
‘ఇవాళ మేం ఇద్దరం ఈ ముహుర్తానికి పెళ్లి చేసుకోవాల్సి ఉంది. దానికి బదులు మీ కోసం పనిలోనే ఉండిపోయాం. మా కోసం మీరూ ఇళ్ల దగ్గరే ఉండిపోండి’ అంటూ అందులో కామెంట్ తో పోస్టు చేశారు.
ఆ పోస్టులో గెరాల్డ్‌టన్ హాస్పిటల్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుండగా వారిద్దరూ హాస్పిటల్ యూనిఫామ్ లో ఉండి ముద్దు పెట్టుకుంటూ ప్లకార్డు చూపిస్తున్నారు. దానిపైనే మీ కోసం ఇక్కడే ఉండిపోయాం మీరు ఇళ్ల దగ్గరే ఉండండి అని రాసి ఉంది. వారు పోస్టు చేసిన ఆ ఫొటో వైరల్ అయింది. కొలీగ్స్, స్నేహితులు అంతా కలిసి ఆ డాక్టర్లకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. డ్రెస్‌కు బదులుగా ఓ మెటీరియల్ ఏర్పాటు చేసి, ఓ సూట్ రెడీ చేసి ఇలా వారిద్దరినీ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిలా తయారుచేశారు.
మ్యాక్స్, గ్రెటా తర్వాతి పోస్టులో ఇంకొక ఫొటో పంచుకున్నారు. ‘మీరు పెళ్లి చేసుకోలేని సమయంలో పనిలో బిజీగా ఉండిపోయి మీతో పాటు నలుగురు మంచి వాళ్లు ఉంటే వారే మిమ్మల్ని రెడీ చేస్తారు. చెత్త సంచితో కూడా మీకు నచ్చినట్లు చేయగలరు. బ్యూటిఫుల్ కపుల్ గా రెడీ చేయడంలో నో డౌట్’ అంటూ ఫాలోవర్లతో పంచుకున్నారు.
వాళ్లని ఎలా రెడీ చేశారో తెలుసా.. చెత్త సంచిగా వాడే నల్ల కవర్ను కత్తిరించి భుజాల వరకూ తొడిగి సూట్ రెడీ చేశారు. కొన్ని పూలు జేబు దగ్గర అతికించారు. ఆమెకు తెల్ల గుడ్డతో వెడ్డింగ్ గౌనులా రెడీ చేశారు. నడుముకు బెల్ట్ లా పింక్ కలర్ గుడ్డతో చుట్టారు.