ఎంగేజ్ మెంట్ రింగ్ మింగేసిన పెంపుడు కుక్క : అప్పుడేం చేశారంటే..

ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలు ఎంత అల్లరి చేసినా యజమానులు దాని అల్లరి ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ కుక్క సరదాగా చేసిందో..ఎందుకు చేసిందో లేదా మంచి ఆకలిమీదుండి చేసిందో తెలీదు కానీ ఆ ఇంట్లో జరిగాల్సిన ఎంగేజ్ మెంట్ కు చేయించిన ధగధగ మెరిసిపోతున్న ‘ఉంగరాన్ని’ లటుక్కున మింగేసింది. ఆ కుక్క పేరు పెప్పర్. అది చూసిన పెప్పర్ యజమానురాలి గుండె గుటుక్కుమంది. ఆమె గుండెలు అద్దిరిపోయాయి. ఎందుకంటే అది డైమండ్ రింగ్..అది మింగితే తన ముద్దుల కుక్కకు ఏమవుతుందోననే ఆందోళన ఒక వైపు..అది డైమండ్ రింగ్ కావటం మరోవైపు..ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.
వెటనే దాన్ని తీసుకుని హాస్పిటల్ కు పరుగు పెట్టింది. ఆసుపత్రి వాళ్లు కుక్క ఎక్స్ రే తీశారు. పెప్పర్ కడుపులో ఉన్న డైమండ్ రింగ్ చక్కగా కనిపించింది. వెంటనే పెప్పర్(కుక్క)కు కృత్రిమ వాంతులు చేయించారు డాక్టర్లు ఎట్టకేలకు దాని నోటి నుంచి డైమండ్ రింగ్‌ను బయటకు కక్కించారు.
దీంతో పాపం పెప్పర్ కు కాస్త నలత చేసింది. కానీ దానికి ఏమీ కాదని కాసేపటికి చక్కగా ఆరోగ్యంగా గంతులేస్తుందని చెప్పారు. ఇక ఈ విషయాన్నంతటినీ ఫొటోలతో సహా ఆసుపత్రి యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. 4.k షేర్లు చేశారు.
నలతగా ఉండే పెప్పర్ ఫోటో చూస్తే..అయ్యో తెలీక మా అమ్మా (యజమానురాలు) ఎగేజ్ మెంట్ ఉంగరం మింగేశాను. నన్ను క్షమించండీ..కానీ మా అమ్మ ఉంగరం ఎలాగైతేనే ఇచ్చేయగలిగాను అన్నట్లుగా ఉంది.