Donald Trump: యుక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ పాటించండి: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

యుద్ధాన్ని ముగించడానికి ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్‌ చెప్పారు.

Donald Trump: యుక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ పాటించండి: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald Trump

Updated On : December 8, 2024 / 7:04 PM IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా పారిస్‌లో ఫ్రెంచ్, యుక్రెయిన్‌ అధ్యక్షులతో సమావేశమయ్యారు. యుక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. దాదాపు 1,000 రోజుల నుంచి రష్యా, యుక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

యుద్ధాన్ని ముగించడానికి ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్‌ చెప్పారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా యాప్‌ ట్రూత్‌లో ట్రంప్‌ ఓ పోస్ట్ చేశారు. రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అసలు ఆ యుద్ధం ప్రారంభం కాకుండా ఉండాల్సిందని చెప్పారు.

“వెంటనే కాల్పుల విరమణను పాటించాలి. యుద్ధాన్ని ఆపడానికి చర్చలు ప్రారంభించాలి. చాలా మంది జీవితాలను అనవసరంగా నాశనం చేస్తున్నారు. చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయి” అని ట్రంప్‌ పేర్కొన్నారు.

కాగా, శనివారం యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో పారిస్‌లో ట్రంప్ సమావేశమయ్యారు. యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి (2022, ఫిబ్రవరి 24 నుంచి) ఇప్పటివరకు 43,000 మంది సైనికులను కోల్పోయామని, మరో 3,70,000 మంది గాయపడ్డారని జెలెన్స్కీ చెప్పినట్లు పలు మీడియా చానెళ్లు పేర్కొన్నారు.

Mobile Phone Explosion : ప్యాంటు జేబులో పేలిన మొబైల్ ఫోన్.. స్కూల్ ప్రిన్సిపల్ మృతి..