Mobile Phone Explosion : ప్యాంటు జేబులో పేలిన మొబైల్ ఫోన్.. స్కూల్ ప్రిన్సిపల్ మృతి..
జేబులో ఉన్న సెల్ ఫోన్ బాంబులా పేలిపోవడం స్థానికంగా సంచలనం రేపింది.

Mobile Phone Explosion (Photo Credit : Google)
Mobile Phone Explosion : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ స్కూల్ ప్రిన్సిపల్ మృతి చెందారు. సకోలి తాలూకా సంగడీలో ఈ ఘటన జరిగింది. ఆయన పేరు సురేశ్ సంగ్రామ్. వయసు 55 ఏళ్లు. జిల్లా పరిషత్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. సంగ్రామ్ మరో వ్యక్తితో కలిసి ఫంక్షన్ కు పయనం అయ్యారు. మోటర్ సైకిల్ పై వారిద్దరూ వెళ్తున్నారు. సంగ్రామ్ మోటార్ సైకిల్ నడుపుతున్నారు. అయితే, సడెన్ గా సంగ్రామ్ ప్యాంటు జేబులోని ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో సంగ్రామ్ కు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి.
బైక్ పై వెనన కూర్చున్న సంగ్రామ్ బంధువు బైక్ పై నుంచి కిందకు పడ్డారు. ఆయనకు కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సంగ్రామ్ కన్నుమూశారు. సంగ్రామ్ ఫోన్ బాగా హీట్ ఎక్కిపోయి పేలిపోయిందని తెలుస్తోంది. జేబులో ఉన్న సెల్ ఫోన్ బాంబులా పేలిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. కాగా, ఫోన్ బ్యాటరీ ఓవర్ హీట్ కావడం వల్లే ఫోన్ పేలి పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
మొబైల్ ఫోన్ పేలిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా బ్యాటరీలో లోపాలు, సమస్యల వల్లే ఫోన్లు పేలిపోతూ ఉంటాయన్నారు. ఎక్కువ సేపు ఫోన్ ని ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదాలు అధికశాతం ఉన్నాయంటున్నారు. ఇక ఎక్కువ సేపు ఫోన్ ను ఎండకు, సూర్యరశ్మికి గురి చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కిపోయి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందన్నారు. నిపుణులు ఇచ్చే సూచన ఏంటంటే.. ఫోన్ ను గంటల తరబడి చార్జింగ్ పెట్టకపోవడమే సురక్షితం. కొంతమంది ఛార్జింగ్ అయిపోయినా.. ఇంకా ఫోన్ ను అలాగే ఛార్జర్ కు కనెక్ట్ చేసి ఉంచుతారు. ఇలాంటి పొరపాట్ల వల్ల బ్యాటరీ వేడెక్కిపోయి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
Also Read : అంతరిక్షంలో అణుబాంబు..! ప్రపంచ దేశాలను వణికిస్తున్న కాస్మోస్ 2553.. ఏంటీ కాస్మోస్? అంత డేంజరా?