Cosmos 2553 : స్పేస్‌లో రష్యా రహస్య ఆయుధం ఎందుకు? టార్గెట్ ఎవరు?

రోదసిలో రహస్య ఆయుధంతో రష్యా ఏం చేయబోతోంది? ప్రపంచ దేశాల భయాలను నిజం చేస్తుందా?

Cosmos 2553 : స్పేస్‌లో రష్యా రహస్య ఆయుధం ఎందుకు? టార్గెట్ ఎవరు?

Updated On : December 8, 2024 / 12:44 AM IST

Cosmos 2553 : భూమి మీద జరిగే యుద్ధాలు చూశాం. గాలిలో, నీటిలో జరిగే యుద్ధాలు చూశాం. అదే యుద్ధం అంతరిక్షంలో జరిగితే.. అదీ అణుబాంబులతో జరిగితే.. ఇలా కూడా అవుతుందా అనుకుంటున్నారా? అవుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. యుక్రెయిన్ తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా.. అంతరిక్షంలో ఆయుధాలు దాచి పెట్టింది. అమెరికాతో సహా ఇప్పుడు చాలా దేశాలను వణికిస్తోంది ఇదే. అసలు అంతరిక్షంలో ఆయుధాలు ఏంటి? అదెలా సాధ్యం? దేశాల టెన్షన్ కు అసలు కారణం ఏమిటి?

ప్రపంచమంతా యుద్ధ భయంలో ఉన్న వేళ.. రష్యా చేసిన ఓ పని ఇప్పుడు ఆ టెన్షన్ ను రెట్టింపు చేస్తోంది. అంతరిక్షంలో రహస్య ఆయుధాన్ని ప్రవేశపెట్టింది రష్యా. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. యుక్రెయిన్ తో రష్యా భీకరమైన యుద్ధం చేస్తోంది. క్షిపణి దాడులు చేసేందుకు యుక్రెయిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పుతిన్ మరింత మండిపోతున్నారు. డ్రోన్లు, క్షిపణులతో యుక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నారు. క్షిపణి దాడులు చేసేందుకు యుక్రెయిన్ కు అనుమతి ఇస్తే.. నాటో దేశాలు కూడా యుద్ధంలో చేరినట్లు ఫిక్స్ అవుతామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన పుతిన్.. దేశ అణువ విధానంలోనూ మార్పులు చేశారు.

రోదసిలో రహస్య ఆయుధంతో రష్యా ఏం చేయబోతోంది? ప్రపంచ దేశాల భయాలను నిజం చేస్తుందా? అనే ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అసలు పుతిన్ ఆలోచనలు ఏంటి? అంతరిక్షంలో అణుబాంబు పేలితే ఆ పరిణామాలు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? అసలు ప్రపంచ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ప్రపంచ దేశాలను వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు ఏంటి?

పూర్తి వివరాలు..

Also Read : సిరియాకు వెళ్లొద్దు.. అక్కడున్న భారతీయులు వెంటనే వచ్చేయండి.. అర్థరాత్రి కీలక ప్రకటన