Gold Card: డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన గోల్డ్ కార్డు చూశారా..? ట్రంప్ ఫొటోతోపాటు.. దాని విలువ ఎంతంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐదు మిలియన్ డాలర్ల విలువైన కొత్త గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Gold Card: డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన గోల్డ్ కార్డు చూశారా..? ట్రంప్ ఫొటోతోపాటు.. దాని విలువ ఎంతంటే..

Donald Trump

Updated On : April 4, 2025 / 11:46 AM IST

Gold Card: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేస్తున్నాడు. అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు. ఈ మేరకు దేశాల వారిగా ప్రతీకార సుంకాల వివరాలను వెల్లడించారు. తాజాగా.. కొత్త గోల్డ్ కార్డు వీసాను ట్రంప్ విడుదల చేశాడు.

Also Read: Gold Rate Today: అదిరే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు గోల్డ్ కార్డును అందుబాటులోకి తెస్తామని, దానిని కొనుగోలు చేసినవారు అమెరికా పౌరసత్వాన్ని పొందొచ్చునని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆయన విడుదల చేశారు. గోల్డ్ కార్డుపై ట్రంప్ చిత్రాన్ని కూడా ముద్రించారు. గోల్డ్ కాయిన్ రంగంలో కార్డు ఉంది.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ఏ దేశం ఉత్పత్తులపై ఎంతశాతం సుంకాలు విధించారంటే.. పూర్తి వివరాలు ఇలా..

అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా (ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ రద్దు చేశారు. దాని స్థానంలో గోల్డ్ కార్డు వీసాను అందుబాటులోకి తెచ్చారు. ఈ గోల్డ్ కార్డు వీసాను దక్కించుకోవాలంటే ఐదు మిలియన్ డాలర్లు (సుమారు రూ.44 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందని, ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు అమెరికాలోకి వస్తారని ట్రంప్ అన్నారు.

 

కొత్త గోల్డ్ కార్డు మరో రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని ట్రంప్ చెప్పారు. అయితే, గోల్డ్ కార్డు మొదటి కొనుగోలుదారు ఎవరని మీడియా ప్రతినిధులు ట్రంప్ ను ప్రశ్నించగా.. తానేనంటూ సమాధానం ఇచ్చారు. ఐదు మిలియన్ డాలర్లు వెచ్చిస్తే గోల్డెన్ కార్డు మీది కూడా అవ్వొచ్చని అన్నారు. అయితే, ఈ గోల్డ్ కార్డు రెండు వారాల్లో అమ్ముడయిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.