King Charles III: ఈ కాలంలో పట్టాభిషేకాలు ఏంటని ఆందోళనలు.. 52 మంది అరెస్టు.. వీడియో
King Charles III: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-II (Queen Elizabeth) కన్నుమూతతో ఇకపై రాచరిక పద్ధతులు ముగుస్తాయని చాలా మంది భావించారు. అయితే, సీన్ రివర్స్ అయింది.

King Charles III
King Charles III: ఓ వైపు లండన్‌లో కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతుంటే, మరోవైపు, చాలా మంది ఆందోళనలకు దిగారు. ఈ కాలంలోనూ ఇటువంటివి ఏంటని, రాజు స్థానంలో రాష్ట్రపతి వంటి దేశ నాయకుడిని ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. దీంతో, పోలీసులు 52 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.
రాచరికవాద వ్యతిరేక గ్రూపులోని నేతలు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. దీంతో పలువురు ఎంపీలు, ఆందోళనకారులు మండిపడ్డారు. తమకు ఉన్న స్వేచ్ఛ, హక్కులను హరిస్తున్నారని అన్నారు. లండన్ లోని ట్రఫాల్గర్ స్క్వేర్ లో ఆందోళన చేయాలనుకున్న వారి ప్రణాళికలను పోలీసులు భగ్నం చేశారు.
లండన్ మెట్రోపొలిటన్ పోలీసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ… పలు కారణాల వల్ల 52 మందిని అరెస్టు చేశామని, వారందరూ కస్టడీలో ఉన్నారని వివరించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల ఆవేదనను అర్థం చేసుకోగలమని, అయితే, తాము చట్టం ప్రకారం పనులు చేస్తామని పోలీసులు అన్నారు.
రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా వారిని అరెస్టు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో యూకే మంత్రి ఒకరు మాట్లాడుతూ… పట్టాభిషేకం వేళ ఆందోళనలను నియంత్రించడానికి పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. గ్రహం స్మిత్ అనే వ్యక్తిని 16 గంటల పాటు కస్టడీలో ఉంచి పోలీసులు విడుదల చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఇకపై యూకేలో ఉండదా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-II (Queen Elizabeth) కన్నుమూతతో ఇకపై రాచరిక పద్ధతులు ముగుస్తాయని చాలా మంది భావించారు. అయితే, ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-III మళ్లీ రాజుగా బాధ్యతలు స్వీకరించడంతో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాలు మండిపడుతున్నాయి.
Today I was arrested at the #Coronation on suspicion of carrying eggs. I was identified by facial recognition cameras, and snatched from the protest in handcuffs so tight they cut my skin. For the second time I was dragged through a crowd of monarchists baying for my blood….1 pic.twitter.com/i014GTOOuW
— Patrick Thelwell (@PatrickEggsKing) May 6, 2023
Huge anti-monarchy protest outside of #Cardiff castle. #Coronation pic.twitter.com/ZWD0McVzzj
— Claire Boad (@ClaireBoad) May 6, 2023
King Charles III: బ్రిటన్ రాజు పట్టాభిషేకం ముగిసింది.. మరి ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?