బ్రేకింగ్ : బంగ్లాదేశ్ విమానం హైజాక్ !

  • Publish Date - February 24, 2019 / 02:14 PM IST

ఢాకా నుండి దుబాయ్ వెళుతున్న (బీజీ 147) విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసేందుకు ట్రై చేయడంతో తీవ్ర కలకలం రేపింది. అనుమతి తీసుకుని అత్యవసరంగా చిట్టగ్యాంగ్‌లోని షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దింపేశాడు పైలెట్. అప్పటికే సమాచారం అందుకున్న కమెండాలు ప్లేన్‌ని చుట్టుముట్టారు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. అయితే..పైలెట్‌తో పాటు మరొక సిబ్బందిని కిడ్నాపర్ బంధించినట్లు టాక్. విమానం మాత్రం ఎలాంటి హైజాక్‌కి గురి కాలేదని బంగ్లాదేశ్ దేశం పేర్కొంటోంది. 
Read Also: ప్రాణం తీసిన ఫ్రస్టేషన్ : భార్యపై కోపం వచ్చి విమానం హైజాక్ యత్నం

దుబాయ్ నుండి ఢాకాకు ఓ విమానం ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం వెళుతోంది. సాయంత్రం 6.45 సమయంలో విమానంలో ఉన్న ప్రయాణీకుల్లో ఒకరు ఒక్కసారిగా లేచి గన్‌తో ఇతరులను బెదిరించాడు. కాల్పులు చేసినట్లు సమాచారం. నేరుగా కాక్ పిట్‌లోకి వెళ్లాడు. వెంటనే పైలట్ చిట్టగ్యాంగ్ ఎయిర్ పోర్టుకు సమాచారం అందించాడు. అత్యవసరంగా విమానాన్ని అక్కడ దింపేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా సిబ్బంది చిట్టగ్యాంగ్ ఎయిర్ పోర్టును ఆధీనంలోకి తీసుకున్నారు. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగలేదని, పైలెట్, మరొక సిబ్బందిని కిడ్నాపర్ ఆధీనంలో ఉంచుకున్నాడని తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రధానితో మాట్లాడాలని హైజాక్ చేసిన వ్యక్తి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 

ఎంతో కట్టుదిట్టంగా..క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించే ఎయిర్ పోర్టులో గన్‌తో ఎలా ఎంట్రీ ఇచ్చాడని తెలియడం లేదు. భద్రతా లోపమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతనికి ఎవరైనా సహకరించారా ? ఇతను ఎక్కడి వాడు ? ఎక్కడకు వెళుతున్నాడు ? ఎందుకు హైజాక్ చేశాడు ? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?