Dwarves Village : ఆ గ్రామంలో అందరు మరుగుజ్జులే..ఇదేం శాపమోనని వాపోతున్న ప్రజలు

అదొ వింత గ్రామం.పుట్టటం బాగానే పుడతారు. కానీ పొడగు మాత్రం ఎదగరు. ఆ గ్రామంలో అందరు మరగుజ్జులే. మూడు అడుగుల పొడుగు మించి ఎదగరు.

Dwarves Village : ఆ గ్రామంలో అందరు మరుగుజ్జులే..ఇదేం శాపమోనని వాపోతున్న ప్రజలు

Dwarves Village

Updated On : December 22, 2021 / 5:18 PM IST

Dwarves Village In china : అదొ వింత గ్రామం.పుట్టటం బాగానే పుడతారు. కానీ పొడగు మాత్రం ఎదగరు. ఆ గ్రామంలో అందరు మరగుజ్జులే. దీంతో ఆ గ్రామం పేరు కంటే మరగుజ్జుల గ్రామంగానే పేరొందింది. మాకు ఇదేం శాపమో అని గ్రామస్తులు వాపోతుంటారు. ఆ వింత గ్రామం పేరు ‘యాంగ్సీ’. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంటుందీ గ్రామం. ఈ గ్రామంలోని మొత్తం జనాభాలో సగానికిపైగా మంది మరుగుజ్జులు. మూడు అడుగులు మించి ఎత్తు పెరగనే పెరగరు. కేవలం 2 అడుగుల నుంచి మూడు అడుగుల వరకు మాత్రమే పెరుగుతారు. ఆ తరువాత పెరుగుదల ఆగిపోతుంది. అలా వారుమరుగుజ్జులుగా ఉండిపోతున్నారు.

Read more : 1 Village,2 Languages : మహిళలు ఒక భాష..పురుషులు మరొక భాష మాట్లాడే వింత గ్రామం

పోని పుట్టుకల్లో ఏదన్నా సమస్యలున్నాయా? అంటే అవేమీ కావు. పిల్లలు బాగానే పుడతారు. ఎత్తు కూడా ఐదు నుంచి ఏడేళ్ల వరకు బాగా పెరుగుతారు. ఆ తరువాత నుంచి ఎత్తు పెరగటం సడెన్ గా ఆగిపోతుంది.అలా మూడు అడుగులు మించి పెరగకుండా మరుగుజ్జులుగా ఉండిపోతున్నారు యాంగ్సీ గ్రామస్తులు. దీని గురించి పాపం యాంగ్జీ గ్రామస్థులు మధనపడుతుంటారు. అందరిలా తాము కూడా పొడవుగా ఉండే బాగుండు అని బాధపతుడుతుంటారు. ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉందని..దాని వల్లే తాము పెరగటంలేదని నమ్ముతుంటారు. యాంగ్జీ గ్రామానికి శాపగ్రస్త గ్రామం అనే నమ్మకం కూడా ఉంది. అదే నమ్మకాన్ని ఈనాటికి నమ్ముతుంటారు ఆ గ్రామస్తులు.

యాంగ్సీ పురాతన కాలం నుంచి శాపగ్రస్తమైన గ్రామం అనే నమ్మకం ఈనాటికి కొనసాగుతోంది. కానీ దీనికి కారణం జపాన్ దేశం చైనా వైపు విడుదల చేసిన విష వాయువు ప్రభావం వల్లే ఈ గ్రామంలో మరుగుజ్జు వ్యాప్తి చెందిందని కూడా కొందరు భావిస్తున్నారు. దీని వెనుక కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేలలు, మొక్కలు మరియు అన్ని రకాలపై శోధించారు మరియు ప్రయోగాలు చేశారు కానీ ఏమీ తెలియలేదు.

Read more :  Viral Village : అదో వింత గ్రామం..ఎవ్వరూ బట్టలు వేసుకోరు..!!

పరిశోధనల్లో భాగంగా గ్రామంలోని మట్టిలో పాదరసం ఎక్కువ మోతాదులో ఉందని తేల్చారు. దీనివల్ల ఇక్కడి ప్రజల ఎత్తు పెరగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ రహస్యానికి ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు.కానీ దాదాపు 60 ఏళ్ల క్రితం ఒకప్పుడు ఈ గ్రామంలో ఒక విచిత్రమైన జబ్బు వచ్చిందని అప్పటినుంచే ఈ మరుగుజ్జుతనం వచ్చిందని..5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల చిన్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడ్డారనీ..అలా పెరుగుదల ఆగిపోయిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పిల్లలకు జన్మనిచ్చిన పెద్దలు, ఆ పిల్లలు 3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగరు. అలా ముసలివారు..పిల్లలు కూడా ఒకే ఎత్తులో ఉంటాడు.