Gulf of California Earthquake: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. సునామీ ముప్పు లేదు

గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది....

Gulf of California Earthquake: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. సునామీ ముప్పు లేదు

Gulf of California Earthquake: గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే యూఎస్ వెస్ట్ కోస్ట్, బ్రిటిష్ కొలంబియా లేదా అలాస్కాకు సునామీ ప్రమాదం లేదని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. మెక్సికో సివిల్ డిఫెన్స్ కార్యాలయం భూకంపం సంభవించిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై ఆరా తీస్తోంది.

Trains Cancellation: రైల్వే ప్రయాణికులు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు 28 రైళ్లు రద్దు.. ఆ రైళ్ల వివరాలు ఇవే..

భూకంపం వల్ల ఓడరేవులలో ప్రవాహాలు సంభవించే అవకాశం ఉన్నందున పడవలు, సమీపంలోని తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం సంభవించిన ప్రాంతంలో కొన్ని సముద్రపు నీటి మట్టాలలో చిన్న వ్యత్యాసాలు ఉండవచ్చని మెక్సికన్ పౌర రక్షణ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. పాకిస్థాన్, మెక్సికోలోనూ సోమవారం భూకంపం వచ్చింది.

Khalistani terrorist Hardeep Singh :కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చివేత

సెంట్రల్ మెక్సికో తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయింది. తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలు రాగానే జనం భయంతో పరుగులు తీశారు