Narendra Modi: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ప్రదానం.. ఈ ప్రాంతాలను సందర్శించిన భారత ప్రధాని

మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.

Narendra Modi: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ప్రదానం.. ఈ ప్రాంతాలను సందర్శించిన భారత ప్రధాని

Narendra Modi

Updated On : June 25, 2023 / 4:30 PM IST

Narendra Modi – Egypt: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్ట్ రాజధాని కైరో(Cairo)లో పర్యటిస్తున్నారు. మోదీకి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ( Abdel Fattah al Sisi ) తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ప్రదానం చేశారు. అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ నిన్న ఈజిప్ట్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మోదీ ఈజిప్ట్ తో ధ్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్బౌలీతో మోదీ చర్చలు జరిపారు. కైరోలోని ఓ హోటల్ లో మోదీ బస చేశారు. అక్కడ ఆయనకు నిన్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వందేమాతరం, మోదీ నినాదాలు చేశారు.

తన పర్యటనలో భాగంగా మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది. దీన్ని 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అలాగే, హెలియోపొలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకాన్ని సందర్శించారు మోదీ. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ 5 రోజుల అమెరికా-ఈజిప్ట్ పర్యటన నేటితో ముగియనుంది.

Modi meets Egyptian Yoga instructors : ఈజిప్టులో మోదీని కలిసిన మహిళా యోగా శిక్షకులు..భారత్ సందర్శించాలని ప్రధాని ఆహ్వానం