Sunita Williams: భూమిపైకి సునీత విలియమ్స్.. జో బైడెన్ పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

వ్యోమగాములు భూమిపైకి చేరుకున్న తరువాత ఎలాన్ మస్క్ ఓ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Elon Musk

Sunita Williams: సుదీర్ఘ నిరీక్షణ తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు భూమిపైకి చేరుకున్నారు. వారితోపాటు మరో ఇద్దరు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఈ సందర్భంగా ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్‌ను ర‌క్షించిన స్పేస్ఎక్స్‌, నాసా బృందాల‌కు.. బిలియ‌నీర్, స్పేస్ఎక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ‌వ‌ర్న్‌మెంట్ ఎఫిషియ‌న్సీ అధినేత అయిన ఎలాన్ మ‌స్క్ థ్యాంక్స్ చెప్పారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: Sunita Williams: సునీత విలియమ్స్ వచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను సముద్రంలోనే ఎందుకు ల్యాండింగ్ చేశారో తెలుసా?

వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని చేరుకున్న తరువాత ఎలాన్ మస్క్ ఓ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను భూమిమీదకు తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాం. కానీ, రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకొని ఉంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు ముందుగానే భూమిపైకి చేరుకునేవారు’’ అని మస్క్ అన్నారు.

Also Read: Sunita Williams : గుజరాత్‌లో హర్షధ్వానాలు.. సునీత విలియమ్స్ సేఫ్‌‌గా భూమికి తిరిగిరావడంతో సంబరాలు..!

బైడెన్ ప్రభుత్వం వ్యోమగాముల పట్ల దారుణంగా వ్యవహరించింది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలా చేయలేదు. ఈ మిషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఐఎస్ఎస్ లో చిక్కుకున్న వ్యోమగాములను త్వరగా తీసుకురావాలని ఆదేశించారు. ట్రంప్ కృషితో ఇది సాధ్యమైందంటూ పేర్కొన్న మస్క్.. ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత తన ఎక్స్ ఖాతాలో మిషన్ విజయవంతం చేసిన నాసా, స్పేస్ ఎక్స్ లకు శుభాకాంక్షలు తెలిని పేర్కొన్నారు.