Sunita Williams: సునీత విలియమ్స్ వచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను సముద్రంలోనే ఎందుకు ల్యాండింగ్ చేశారో తెలుసా?

అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది.

Sunita Williams: సునీత విలియమ్స్ వచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను సముద్రంలోనే ఎందుకు ల్యాండింగ్ చేశారో తెలుసా?

Updated On : March 19, 2025 / 6:55 AM IST

Sunita Williams: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి వచ్చారు. తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ప్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్ కు ఇబ్బంది ఎదురు కాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతపరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అయితే, వ్యోమగాములతో భూమిపైకి వచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను సముద్రంలోనే దింపడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Also Read: Sunita Williams : గుజరాత్‌లో హర్షధ్వానాలు.. సునీత విలియమ్స్ సేఫ్‌‌గా భూమికి తిరిగిరావడంతో సంబరాలు..!

అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది. రష్యా తమ స్పేస్ క్యాప్సూల్స్ ను నేలపై దించుతుండగా అమెరికా మాత్రం సముద్ర జలాల్లో దించుతోంది. భౌగోళికంగా తనకున్న వెసులుబాట్ల వల్ల వ్యోమనౌకను సముద్ర జలాల్లో ల్యాండింగ్ చేసేందుకు అమెరికా ఎంచుకుంటోంది. భూ వాతావరణంలోకి వ్యోమనౌక ప్రవేశించాక పారాచూట్లతో వేగాన్ని తగ్గించుకొని వ్యోమగాములకు హానికగలని రీతిలో సముద్రంలో ల్యాండింగ్ చేస్తుంది. తాజాగా అదేరీతిలో సునీత విలియమ్స్, విల్మోర్ లు వచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను ప్లోరిడాలోని సముద్ర జలల్లో సురక్షితంగా ల్యాండింగ్ చేసింది.

Also Read: Sunita Williams : వావ్.. అద్భుతం.. భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్, విల్మోర్‌.. స్వాగతం పలికిన డాల్ఫిన్లు..!

నీటిపై ల్యాండింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీటి సాంద్రత, చిక్కదనం తక్కువ. అందువల్ల ల్యాండైన వ్యోమనౌక పాలిట కూషన్ లా ఇది పనిచేస్తుంది. అందువల్ల వ్యోమనౌక దెబ్బతినే ముప్పు చాలా తక్కువ. అదేవిధంగా సముద్రంలో సువిశాలంగా ఉంటుంది. అత్యంత కచ్చితమైన ప్రదేశంలో ల్యాండింగ్ అయ్యే సౌకర్యం లేని వ్యోమనౌకలకు ఇది ప్రయోజనకరం. ఇది నిర్దేశిత ప్రదేశంలో కాక ఒకింత పక్కకు వెళ్లినా ఇబ్బంది ఉండదు. అంతేకాక.. ల్యాండింగ్ తరువాత సహాయ బృందాలు సులువుగా వ్యోమనౌక ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. వ్యోమగాములను క్షేమంగా బయటకు తీసుకురావొచ్చు. అందుకే అమెరికా సముద్ర జలాల్లో వ్యోమనౌకను దించేందుకు ఎంచుకుంది.

 

 

2011 వరకూ ఆ దేశానికి సేవలందించిన స్పేస్ షటిళ్లు మాత్రమే రవ్ వేలపై విమానాల్లా దిగాయి. గతంలో జెమినీ, అపోలో, మెర్క్యూరీ, తాజాగా క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూళ్లు సాగరాల్లోనే ల్యాండ్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. గగన్ యాన్ పేరిట మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న భారత్ కూడా ఇదే పద్దతిలో సముద్ర ల్యాండింగ్ ను ఎంచుకుంది.