Sunita Williams : వావ్.. అద్భుతం.. భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్, విల్మోర్‌.. స్వాగతం పలికిన డాల్ఫిన్లు..!

Sunita Williams : 8 రోజుల మిషన్ అంతరిక్షంలో 9 నెలల కఠిన పరీక్షగా మారిన తర్వాత వ్యోమగాములు ఇద్దరూ భూమిపైకి అడుగుపెట్టారు.

Sunita Williams : వావ్.. అద్భుతం.. భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్, విల్మోర్‌.. స్వాగతం పలికిన డాల్ఫిన్లు..!

Dolphins Welcome Sunita Williams

Updated On : March 19, 2025 / 4:29 AM IST

Sunita Williams : వావ్.. అద్భుతం జరిగింది.. 9 నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. 8 రోజుల మిషన్ అంతరిక్షంలో 9 నెలల కఠిన పరీక్షగా మారిన తర్వాత వ్యోమగాములు ఇద్దరూ భూమిపైకి అడుగుపెట్టారు. నాసా నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి సురక్షితంగా చేరుకున్నారు.

Read Also : Sunita Williams : సునీత విలియమ్స్‌ వచ్చేస్తోంది.. భూమిపైకి ల్యాండ్ అవుతోంది చూడండి.. లైవ్ వీడియో ఇదిగో..!

నాసా, స్పేస్ఎక్స్ క్రూ-9ని ఏర్పాటు చేసింది. ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక వ్యోమగాములను భూమిపైకి తీసుకువచ్చి ఫ్లోరిడా తీరంలో తెల్లవారుజామున 3:27 గంటలకు కిందకు దిగింది. ఈ క్రమంలో సముద్రంలోని డాల్ఫిన్లు వ్యోమగాములను స్వాగతించాయి. క్యాప్సూల్ చుట్టూ ఈత కొడుతూ కనిపించాయి. ఆ తరువాత నౌకను రికవరీ ప్రక్రియ ప్రారంభమైంది. క్యాప్సల్స్ తిరిగి పొందే ఆపరేషన్ జరుగున్న సమయంలో డాల్ఫిన్లు ఆ క్యాప్సిల్స్ చుట్టూ ఈదుతున్నాయి.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన కొన్ని గంటల తర్వాత విలియమ్స్, విల్మోర్ స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ సాయంత్రం వేళ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పారాచూట్ సాయంతో సజావుగా ల్యాండింగ్ చేసింది. ఫ్లోరిడాలోని పాన్‌హ్యాండిల్‌లోని తల్లాహస్సీ తీరంలో స్ప్లాష్‌డౌన్ జరిగింది.

గత ఏడాదిలో బోయింగ్ సమస్యాత్మక స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌తో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి, జూన్ 5న బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ సిబ్బంది క్యాప్సూల్‌లో ప్రయోగించిన తర్వాత విల్మోర్, విలియమ్స్ ఒక వారం పాటు ఉండాల్సి వచ్చింది.

అయితే, అంతరిక్ష కేంద్రానికి వారి ప్రయాణంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో నాసా స్టార్‌లైనర్‌ను మానవరహితంగా భూమికి తిరిగి పంపింది. టెస్టింగ్ పైలట్‌లను స్పే్స్ఎక్స్‌కి తిరిగి కేటాయించింది. ఈ మార్పుతో ఫిబ్రవరిలో తిరిగిప్రయాణం మళ్లీ ఆలస్యం అయింది.

Read Also : Sunita Williams : వెల్‌కమ్.. సునీత విలియమ్స్.. సురక్షితంగా భూమిపైకి..!

అదనపు స్పేస్ఎక్స్ క్యాప్సూల్ సమస్యలు మరింత ఆలస్యమైంది. చివరికి, ఇద్దరూ వ్యోమగాములు 286 రోజులు అంతరిక్షంలో గడిపారు. నాసా ప్రణాళిక కన్నా 278 రోజులు ఎక్కువ. మిషన్ సమయంలో భూమిని 4,576 సార్లు కక్ష్యలోకి తీసుకుని, సురక్షితంగా భూమిని తాకే ముందు 121 మిలియన్ మైళ్ళు (195 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించారు.