Sunita Williams : వెల్‌కమ్.. సునీత విలియమ్స్.. సురక్షితంగా భూమిపైకి..!

Sunita Williams : అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత, నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ 'బుచ్' విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.

Sunita Williams : వెల్‌కమ్.. సునీత విలియమ్స్.. సురక్షితంగా భూమిపైకి..!

Astronauts Sunita Williams

Updated On : March 19, 2025 / 3:54 AM IST

Sunita Williams : 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ఎట్టకేలకు తిరిగి భూమిపై అడుగుపెట్టారు. భారత కాలమానం ప్రకారం మార్చి 19 (బుధవారం) తెల్లవారుజామున 3.27కు భూమికి సురక్షితంగా చేరుకున్నారు.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఇద్దరు భూమిపైకి తిరిగి వచ్చారు. ఈ వ్యోమనౌక దాదాపు 17 గంటలు ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో దిగింది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ సాయంతో వీరిద్దరూ భూమిపై ల్యాండ్ అయ్యారు. ఫ్లోరిడా సముద్రగర్భంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా అధికారికంగా ప్రకటించింది.

Read Also : Sunita Williams : సునీత విలియమ్స్‌ వచ్చేస్తోంది.. భూమిపైకి ల్యాండ్ అవుతోంది చూడండి.. లైవ్ వీడియో ఇదిగో..!

దాదాపు 9 నెలలు ఐఎస్ఎస్‌లోనే గడిపిన వ్యోమగాములు ఇద్దరూ మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్రూ డ్రాగన్‌ను సముద్రంలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు వ్యోమగాములను తరలించనున్నారు. వీరిద్దరికి తక్షణమే వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. భూ వాతావరణానికి అలవాటు పడేంతవరకు వారికి తగిన చికిత్స అందించనున్నారు.

2024లో జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్‌‌లో సునీత, విల్మోర్ అంతరిక్ష యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. నానా షెడ్యూల్ ప్రకారం.. వారం రోజుల్లో తిరిగి భూమిపైకి రావాల్సి ఉంది. కానీ, స్టార్ లైనర్ సాంకేతిక కారణాలతో వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. దాంతో స్టార్ లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగివచ్చింది.

అప్పటినుంచి వారిద్దరిని భూమికి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి 9 నెలల గడిచిన తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లో మరో ఇద్దరు వ్యోమగాములను నాసా అంతరిక్షానికి పంపింది.

Read Also : Sunita Williams : సునీత విలియమ్స్ కోసం కుటుంబం ప్రార్థనలు.. సురక్షితంగా చేరుకోవాలంటూ ఆ గ్రామంలో యజ్ఞాలు!

భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 10.15 గంటలకు అన్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ ఇంజిన్లను మండించగా భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 3.27 నిమిషాలకు అడుగుపెట్టింది.