Sunita Williams : గుజరాత్‌లో హర్షధ్వానాలు.. సునీత విలియమ్స్ సేఫ్‌‌గా భూమికి తిరిగిరావడంతో సంబరాలు..!

Sunita Williams : దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత వ్యోమగామి సునీతా విలియమ్స్ తోటి క్రూ-9 సభ్యులతో కలిసి సురక్షితంగా దిగారు. గుజరాత్‌లోని సునీత పూర్వపు స్వగ్రామంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Sunita Williams : గుజరాత్‌లో హర్షధ్వానాలు.. సునీత విలియమ్స్ సేఫ్‌‌గా భూమికి తిరిగిరావడంతో సంబరాలు..!

Gujarat cheers

Updated On : March 19, 2025 / 6:36 AM IST

Sunita Williams : నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ స్వస్థలమైన గుజరాత్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఝులసాన్‌లోని నివాసితులంతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, హరతులు పడుతూ పూజలు నిర్వహించారు.

సునీత అంతరిక్షంలో 9 నెలలకు పైగా గడిపారు. క్రూ-9 సభ్యులు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి విలియమ్స్‌ను తిరిగి తీసుకువచ్చిన డ్రాగన్ అంతరిక్ష నౌక విజయవంతంగా ల్యాండ్ అయ్యాక ఆ గ్రామంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. సునీతతో సహా నలుగురు వ్యోమగాముల సురక్షితంగా తిరిగి రావడంపై గుజరాత్‌లోని వారి స్వగ్రామంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Read Also : Sunita Williams : అమ్మయ్యా.. భూమిపై గాలిని పీల్చుతూ.. 9 నెలల తర్వాత ఫస్ట్ టైం ‘ఎర్త్ గ్రావిటీ’ని ఫీల్ అయిన సునీత విలియమ్స్!

అంతకుముందు, విలియమ్స్ బంధువు దినేష్ రావల్ అహ్మదాబాద్‌లో ‘యజ్ఞం’ నిర్వహించారు. సునీత సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థించారు. స్పేస్‌ఎక్స్ స్ప్లాష్‌డౌన్‌ను ధృవీకరించగా, నాసా వ్యోమగామి నిక్ హేగ్ సిబ్బంది సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ల్యాండింగ్ తర్వాత నాసా వ్యోమగామి నిక్ హేగ్ మిషన్ కంట్రోల్‌కు తన మొదటి సందేశాన్ని అందించాడు. ఆడియో కొంతవరకు అస్పష్టంగా ఉందని నివేదిక తెలిపింది.

భూమికి తిరిగి స్వాగతం.. నిక్, సుని, బుచ్ అలెక్స్ అంటూ Xలో పోస్ట్‌లో స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. ఇప్పుడు రెస్క్యూ షిప్‌ పర్యవేక్షణలో వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్రూ-9 బృందాన్ని హ్యూస్టన్‌లోని నాసా పునరావాస కేంద్రానికి తరలిస్తారు. అక్కడ వారికి అదనపు వైద్య సదుపాయలను కల్పిస్తారు.