Elon Musk : ఎలాన్ మస్క్ మన దేశ అల్లుడే..! కొడుకు పేరు శేఖర్.. భారత్‌తో బంధం బయటపెట్టిన టెస్లా అధినేత.. ఎవరీ శివోన్..?

Elon Musk : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ ‘‘WTF is?’’లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి

Elon Musk : ఎలాన్ మస్క్ మన దేశ అల్లుడే..! కొడుకు పేరు శేఖర్.. భారత్‌తో బంధం బయటపెట్టిన టెస్లా అధినేత.. ఎవరీ శివోన్..?

Elon Musk

Updated On : December 1, 2025 / 1:11 PM IST

Elon Musk : అగ్రరాజ్యం అమెరికాతోసహా ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిలో చాలా మంది భారతీయ మూలాలు కలిగిన వారే ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు రాజకీయంగానేకాక వ్యాపార రంగాల్లో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా భారతదేశంతో సంబంధాలను కలిగిఉన్నాడు. ఆయన కుమారుడు పేరు శేఖర్. ఈ విషయాన్ని స్వయంగా మస్క్ వెల్లడించారు.

జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ ‘‘WTF is?’’లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి మస్క్ మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులు భారతీయ మూలాలకు చెందినవారేనని చెప్పారు. తన సహజీవన భాగస్వామికి భారతీయ మూలాలు ఉన్నాయని, నా కుమారుడి పేరులో శేఖర్ పదం ఉందని మస్క్ పేర్కొన్నారు.

న్యూరాలింక్ సంస్థ డైరెక్టర్ శివోన్ జిలిస్‌తో ఎలాన్ మస్క్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంటకు నలుగురు సంతానం. యేల్ యూనివర్శిటీలో విద్యనభ్యసించిన శివోన్.. 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్టులో చేరారు. ఆ ప్రాజెక్టు కింద మానవ మెదడులో ఎలక్ట్రానిక్స్ చిప్ ను అమర్చే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ సంస్థలో శివోన్ జిలిస్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.

Also Read: Glass Bridge: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. దేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి విశాఖలో ప్రారంభం.. దీని ప్రత్యేకతలు ఇవే.. పొడవు ఎంతంటే?

ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ‘‘మీకు తెలుసో లేదో కానీ నా సహజీవన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమెను చిన్న వయస్సులో దత్తతకు ఇచ్చారు. కెనడాలో పెరిగింది. ఇక, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థంగా నా కుమారుడి పేరులో శేఖర్ అనే పదం చేర్చాను’’ అని మస్క్ వెల్లడించారు.

ఎవరీ శివోన్ జిలిస్ ..
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. మస్క్ సతీమణి శివోన్ జిలిస్ ప్రస్తుతం న్యూరాలింక్‌లో ఆపరేషన్స్‌, స్పెషల్ ప్రాజెక్ట్స్ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె భారతీయ మూలాలు కలిగిన మహిళ. ఆమె తల్లి షార్దా పూర్తిగా భారతీయురాలు. షార్దా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరు హిందూ పంజాబీ కుటుంబానికి చెందిన వారు. 2015లో యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివోన్ మాట్లాడుతూ.. పంజాబీ మూలాల వల్ల తనకు పెద్ద కళ్లు వచ్చాయని చెప్పుకుంది. ఆమె బాల్యం కెనడాలోని ఒంటారియోలో గడిచింది. యేల్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రం, ఫిలాసఫీలో పట్టభద్రులయ్యారు. మెదట్లో ఆమె ఐబీఎం, బ్లూమ్‌బర్గ్ సంస్థల్లో పనిచేశారు. 2016లో ఏఐ వైపు దృష్టి మళ్లించిన ఆమె ఓపెన్ ఏఐ సంస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎదిగారు. బోర్డులో అత్యంత పిన్నవయస్సు గల సభ్యురాలిగా గుర్తింపు పొందారు. 2021లో మస్క్, జిలిస్‌కు స్ట్రైడర్, అజూర్ అనే కవలలు జన్మించారు. ఆ తరువాత 2024లో కూతురు ఆర్కేడియా జన్మించింది.