Elon Musk: ఒకప్పుడు కోకాకోలాలో కొకైన్ ఉండేదా?.. ఎలన్ మస్క్ ఏమన్నాడంటే..
ఎలన్ మస్క్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారుమోగుతున్న పేరిది. టెస్లా కంపెనీ సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్.. నాటకీయ పరిణామాల మధ్య 44 బిలియన్ డార్లకు ట్విటర్‌ను తన సొంతం చేసుకున్నాడు. అంతేకాక ట్విటర్‌లో ఆంక్షలను ....

Elen Musk
Elon Musk: ఎలన్ మస్క్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారుమోగుతున్న పేరిది. టెస్లా కంపెనీ సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్.. నాటకీయ పరిణామాల మధ్య 44 బిలియన్ డార్లకు ట్విటర్‌ను తన సొంతం చేసుకున్నాడు. అంతేకాక ట్విటర్‌లో ఆంక్షలను తొలగించి నెటిజర్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలిపేలా మార్పులు, చేర్పులు చేస్తానంటూ ప్రకటించారు. తాజాగా ఎలన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నేను కార్పొనైటెడ్ సాప్ట్ డ్రింక్స్ తయారీతో మల్టీ నేషనల్ కంపెనీగా పేరున్నఅమెరికాన్ కంపెనీ కోకాకోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ట్విటర్‌లో ప్రకటన చేశాడు. అంతటితో ఆగకుండా.. ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకాకోలాకు తిరిగి చేరుస్తానంటూ సంచలన ట్వీట్ చేశాడు.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
ట్విటర్‌ను సొంతం చేసుకున్న నాటినుంచి వరుస ట్వీట్లతో ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోకాకోలాను కొనుగోలు చేస్తానంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌తో పాటు కొకాకోలాలో నిషేధిత కొకైన్‌ను కూడా తీసుకొస్తానని తెలిపారు. దీనికి బదులుగా ప్రణయ్ పాథోలే అనే నెటిజర్ 1894 నుండి బహిరంగంగా విక్రయించబడిన కోకాకోలా కంపెనీ మొదటి బాటిల్ ఫోటోను రీ ట్వీట్ చేశాడు. ఈ ఉత్పత్తిలో 3.5 గ్రాముల కొకైన్ ఉండేదని, దీన్ని తిరిగి తీసుకురండి అంటూ ప్రణయ్ పాథోలే కోరాడు. అయితే కొకాకోలాలో నిషేధిత కొకైన్ తెస్తానని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ కు రెండు మిలియన్ల మంది నెటిజర్లు తమ మద్దతు తెలపడం గమనార్హం.
https://twitter.com/PPathole/status/1519493570973298688
కోకా కోలా ప్రపంచ దేశాల్లో ఎంతో ఆదరణ పొందిన శీతల పానియం. ఈ కోకాకోలాలో కోకా ఆకులు, కోలా గింజలు అనే రెండు ప్రాథమిక పదార్థాలు ఉండేవి. కోలా గింజలు కెఫిన్ యొక్క మూలం కాగా, కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ వస్తుంది. కోకాకోలా ఒకానొక సమయంలో ఎక్కువగా కోకా ఆకుల మీదే ఆధారపడింది. కొకైన్ ను ఆ కాలంలో ఔషదంగా పరిగణించినప్పటికీ, రానురాను అది నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయింది. అమెరికా సైతం దీనిని నిషేదించడంతో కోకాకోలా నుంచి కోకా ఆకులు దూరమై బదులుగా డికోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చి చేరాయి.
Listen, I can’t do miracles ok pic.twitter.com/z7dvLMUXy8
— Elon Musk (@elonmusk) April 28, 2022
ఇటీవల కాలంలో తాను మెక్ డొనాల్డ్స్ ను కొనుగోలు చేస్తానని ట్వీట్ చేసిన మస్క్, అదే ట్వీట్ కు రీ ట్వీట్ చేస్తూ నేను మస్క్ ను.. అధ్బుతాలు చేయలేనంటూ మరో ట్వీట్ చేశాడు. మస్క్ ట్వీట్లను ఫాలో అవుతున్న నెటిజర్లు వింత ప్రకటనలో అవాక్కవుతున్నారు. మరికొందరు సలహాలు ఇస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి ట్విటర్ ను తన సొంతం చేసుకున్న టెస్లా సీఈవో మస్క్ వరుస ట్వీట్లతో నెటిజర్లను ఉత్సాహపరుస్తున్నారు. గతంలో మస్క్ జోక్ గా చేసిన ట్వీట్లే నిజం కావడంతో.. ప్రస్తుతం మస్క్ చేస్తున్న ట్వీట్లు నవ్వులాటగా తీసుకోలేం అంటూ కొందరు నెటిజర్లు ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.