హ్యాపీబర్త్‌డే : ఫేస్‌బుక్‌కి 15ఏళ్లు

ఫేస్‌బుక్.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. చదువుకున్నోడు, చదువుకోని వాడు.. ఇలాంటి డిఫరెన్స్‌లు ఏమీ

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 06:14 AM IST
హ్యాపీబర్త్‌డే : ఫేస్‌బుక్‌కి 15ఏళ్లు

Updated On : February 5, 2019 / 6:14 AM IST

ఫేస్‌బుక్.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. చదువుకున్నోడు, చదువుకోని వాడు.. ఇలాంటి డిఫరెన్స్‌లు ఏమీ

ఫేస్‌బుక్.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. చదువుకున్నోడు, చదువుకోని వాడు.. ఇలాంటి డిఫరెన్స్‌లు ఏమీ లేవు. ప్రతి  ఒక్కరికి ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. ఒక రోజు తిండి తినకుండా అయినా ఉండగలరేమో కానీ ఫేస్‌బుక్ ఓపెన్ చేయకుండా మాత్రం ఉండలేరు. అంతగా ఫేస్‌బుక్‌కి జనాలు కనెక్ట్ అయ్యారు.  2004లో 4గురు ఉద్యోగులతో ప్రారంభమైన ఫేస్ బుక్‌కు.. ఇప్పుడు వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది యూజర్లు ఉన్నారంటే ఫేస్‌బుక్‌కున్న క్రేజ్ ఏంటో  అర్థమవుతుంది. 2019, ఫిబ్రవరి 4వ తేదీతో సోషల్‌ మీడియా బాస్ ఫేస్‌బుక్‌‌కు 15ఏళ్లు నిండాయి. నెట్టింట అడుగుపెట్టి 15 ఏళ్లు అయ్యింది. 2004, ఫిబ్రవరి 4న ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకుడు మార్క్‌  జుకర్‌బర్గ్‌ ఎఫ్బీని ఆన్‌లైన్‌లో పరిచయం చేశారు. అది మొదలు వెనుదిరిగి చూసుకోలేదు.

 

ఫేస్‌బుక్‌కు సంబంధించిన కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్:
* ఫేస్‌బుక్‌ ఒకటిన్నర దశాబ్ధంలో కోట్లాది మందికి చేరువైంది.
* ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజల దైనందిన జీవితాల్లో భాగమైంది.
* స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఫేస్‌బుక్‌ విలువ 500 బిలియన్‌ డాలర్లు
* ఏటా 22 బిలియన్‌ డాలర్ల నికర లాభం
* ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యక్తిగత సంపద 62 బిలియన్‌ డాలర్లు
* 2018 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఫేస్ బుక్ యూజర్లు 2.32 బిలియన్లు
* డైలీ యూజర్లు 1.5 బిలియన్లు
* ప్రపంచంలో నెట్ వినియోగదారుల సంఖ్య 3.9 బిలియన్లు
* 2012లో బిలియన్‌కు చేరిన ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య
* కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా లీక్ స్కాం బాధితులు 87 మిలియన్లు
* 2018లో ఫేస్‌బుక్ ఆదాయం 55 బిలియన్ డాలర్లు
* 2018లో ఆదాయం 22బిలియన్ డాలర్లు
* 2018 ఫేస్ బుక్ ఉద్యోగుల సంఖ్య – 35వేల 587మంది
* 2004లో ఫేస్ బుక్ ఉద్యోగుల సంఖ్య – 4
* 2007లో ఐఫోన్ లాంచ్
* 2008లో iPhone యాప్ లాంచ్
* 2012లో Instagram తీసుకొచ్చిన ఫేస్ బుక్
*  ఒక బిలియన్ డాలర్లతో ఇన్‌స్టాగ్రామ్ కొనుగోలు
* 2013లో 19 బిలియన్ డాలర్లతో వాట్సాప్ కొనుగోలు
* అత్యధిక స్టాక్ ధర, July 25, 2018: 218.62 డాలర్లు
* మార్కెట్ విలువ 119 బిలియన్ డాలర్లు
* కువైట్ జీడీపీ 120 బిలియన్ డాలర్లు
* మార్క్ జుకర్ బర్గ్ సంపద 62.4 బిలియన్ డాలర్లు