ఫేస్‌బుక్.. యూజర్ల ఫోన్ నెంబర్లను ఇక అడగదు!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ఇకపై యూజర్ల ఫోన్ నెంబర్లను వాడడం జరగదని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ‘పీపుల్ యూ మే నో’ ఫ్రెండ్స్ సజెషన్స్ ఫీచర్ సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ అడిగేది. యూజర్ల ప్రైవసీ పరంగా సమగ్ర పరిశీలనలో భాగంగా ఫేస్ బుక్ ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాదిలోనే ఫేస్ బుక్ అడ్వర్టైజ్ మెంట్స్ కోసం యూజర్ల పర్సనల్ డేటాను పొందేందుకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తీసుకొచ్చింది.
ఈ ప్రధాన డిజిటల్ సెక్యూరిటీ టూల్ ద్వారా యూజర్ల ప్రైవసీని బహిర్గతం చేసిందంటూ ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో గత జూన్ నెలలోనే యాడ్స్ కోసం వాడే యూజర్ల ఫోన్ నెంబర్లను అనుమతించడాన్ని సోషల్ దిగ్గజం నిలిపివేసింది.ఇప్పుడా ఆ సెక్యూరిటీ టూల్ ఫ్రెండ్ సజెషన్స్ నుంచి వేరు చేసి ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTS) 5 బిలియన డాలర్ల ఒప్పందానికి సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వడం ప్రారంభించినట్టు తెలిపింది.
అయితే ప్రస్తుతం.. ఈ FTS ఆర్డర్.. కోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉండగా, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా యూజర్ల ఫోన్ల నెంబర్లను అడ్వర్టైజింగ్ కోసం వినియోగించిన ఫేస్ బుక్ ఆయా వివరాలను బహిర్గతం చేయడంలో విఫలమైనట్టు తెలిపింది. ఈ ఏడాదిలోనే ప్రొడక్టు చీఫ్ ప్రైవసీ అధికారికిగా బాధ్యతలు చేపట్టినట్టు ఫేస్ బుక్ ఎగ్జిక్యూటీవ్ మిచెల్ ప్రొట్టి.. మాట్లాడుతూ..టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అప్ డేట్ అనేది కంపెనీ కొత్త ప్రైవసీ మోడల్ కు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
ఈ5 దేశాల్లో ముందు.. ఆ తర్వాతే గ్లోబల్ :
ఈ కొత్త అప్ డేట్.. ప్రస్తుతానికి ఈక్వెడార్, ఇథోపియా, పాకిస్థాన్, లిబియా, కొంబోడియా దేశాల్లో ఈ వారమే ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకోస్తామని అన్నారు. ఫ్రెండ్ సజెషన్స్ కోసం వాడే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా యూజర్ల నుంచి ఫోన్ నెంబర్లను అనుమతించకుండా ఈ కొత్త అప్ డేట్ అడ్డుకుంటుందని మిచెల్ చెప్పారు. ఇదివరకే ఈ సెక్యూరిటీ టూల్ వాడుతున్న యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
ఆ నెంబర్లను డిలీట్ చేయొచ్చు
కానీ, ఫ్రెండ్ సజెషన్స్ ఫీచర్ నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫోన్ నెంబర్లను డి-లింక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.ఆయా ఫోన్ నెంబర్లను డిలీట్ చేసి మళ్లీ కొత్తగా యాడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఎందుకంటే.. ఫ్రెండ్ సజెషన్స్ ఫీచర్ నుంచి ఈ అథెంటికేషన్ సెక్యూరిటీ టూల్ ఫీచర్‌ను వేరు చేయడం జరిగింది.
ఈ వేరు చేసిన టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ టూల్.. వచ్చే సమ్మర్ నుంచి అడ్వర్టైజింగ్ కోసం వినియోగించనుందని, కొత్త యూజర్లు, ప్రస్తుత యూజర్లకు అందరికి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ మహిళా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కొత్త మార్పుకు ముందే ప్రైవసీ స్టేట్ మెంట్స్‌కు సిస్టమ్ అప్ డేట్స్ సపోర్ట్ చేసేలా నిర్ధారించేందుకు ఫేస్ బుక్ ఓ రివ్యూను నిర్వహించినట్టు ప్రొట్టి తెలిపారు.