shocking incident : గోల్ఫ్ టోర్నమెంట్‌లో విరిగిపడిన పైన్ చెట్లు .. పరుగులు తీసిన అభిమానులు
ఒక్కోసారి ప్రమాదాలు పక్కనే పొంచి ఉంటాయి. కొండచరియలు విరిగిపడటం.. చెట్లు పడిపోవడం వంటి ప్రమాదాలు చూస్తూ ఉంటాము. ఓ గోల్ఫ్ టోర్నమెంట్ లో పైన్ చెట్లు కూలిపోయాయి. తరువాత ఏం జరిగింది...

shocking incident
shocking incident : ఒక్కోసారి ప్రమాదాలు చాలా అనూహ్యంగా జరుగుతుంటాయి. అకస్మాత్తుగా వంతెనలు కూలిపోవడం.. గోడలు విరిగిపడటం.. భారీ వృక్షాలు కూలిపోవడం.. ఆ ప్రాంతంలో ఉండి నిజంగా తప్పించుకున్నారంటే మృత్యుంజయులే. అగస్టాలో (Augusta) ఒక్కసారిగా పైన్ చెట్లు (pine trees) విరిగిపడ్డాయి. ఆ తరువాత ఏం జరిగిందంటే?
Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్
అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో (Augusta National Golf Club) 2023 మాస్టర్ టోర్నమెంట్ (Masters Tournament) జరుగుతోంది. గోల్ఫ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సీటింగ్ ప్రాంతంలో మూడు పైన్ చెట్లు కూలిపడ్డాయి. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నవారంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే టోర్నమెంట్‌ను వాయిదా వేసేసారు. అయితే పైన్ చెట్లు ఒకదానితో ఒకటి చిక్కుకు పోవడం వల్ల నెమ్మదిగా కిందపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా అలర్టై పక్కకు తప్పుకున్నారు. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్నాక మొక్కలు తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఇక టోర్నమెంట్ జరిగినప్పుడల్లా అక్కడి వాతావరణం, పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని టోర్నమెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.
intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్
జార్జియా (Georgia), US లలో ఎక్కువగా ఈ పైన్ చెట్లు కనిపిస్తుంటాయి. ఇవి అకస్మాత్తుగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చెట్లు ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Well I can see two or three ladies that should buy a lotto ticket tonight. pic.twitter.com/nZrdE9otZh
— Nick Walker (@nw3) April 7, 2023