Monster Fish : వలలో పడ్డ అరుదైన భారీ చేప..అపశకునమని హడలిపోతున్న మత్స్యకారులు
మత్స్యకారుల వలకు 16 అడుగుల పొడుగున్న ఓ అరుదైన వింత చేప చిక్కింది. అంత భారీ చేప వలలో పడితే మత్స్యకారులు ఆనందపడిపోతారు. కానీ చిలీ మత్స్యకారులు మాత్రం ఆనందం మాట ఎలా ఉన్నా..వలలో పడ్డ ఆ భారీ చేపను చూసి అపశకునం అంటూ హడలిపోతున్నారు. ఇక మన బతుకులు ఎలా ఉంటాయో అని తెగ భయాందోళనలకు గురి అవుతున్నారు.

16 Foot Long Monster ‘oarfish’ In Chile
16 Foot long monster ‘oarfish’ : దక్షిణ అమెరికాలోని దేశమైన చిలీలో మత్స్యకారుల వలకు ఓ అరుదైన వింత చేప చిక్కింది. ఆ చేప దాదాపు 16 అడుగుల పొడుగు ఉంది. అంత భారీ చేప వలలో పడితే మత్స్యకారులు ఆనందపడిపోతారు. పైగా అది అరుదైన చేప కూడాను. కానీ చిలీ మత్స్యకారులు మాత్రం ఆనందం మాట ఎలా ఉన్నా..వలలో పడ్డ ఆ భారీ చేపను చూసి అపశకునం అంటూ హడలిపోతున్నారు. ఇక మన బతుకులు ఎలా ఉంటాయో అని తెగ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇంతకీ ఆ చేపను చూసి ఎందుకు అంతలా భయపడిపోతున్నారంటే..
16 అడుగుల పొడవుతో ఉన్న ఈ రకం చేపలు కనబడటం అపశకునమని.. భూకంపాలు, సునామీలు వంటి విపత్తుల సమయంలోనే ఇవి కనిపిస్తుంటాయని చిలీ మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ చేప ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 16 అడుగుల పొడుగున్న ఆ చేప పేరు ‘ఓర్ ఫిష్’. ఎక్కువగా సముద్రంలో అడుగున జీవిస్తూ ఉంటుంది. ఇటీవల చిలీలో మత్స్యకారులు 16 అడుగుల పొడవైన భారీ ‘ఓర్ ఫిష్’ను పట్టుకున్నారు. ఇదేదో బాగుందని వారు సంబరపడేలోపే.. ఆందోళన మొదలైంది. ఇది కనిపిస్తే ఏదో ఆపద వస్తోందనడానికి సంకేతమని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. 2011లో జపాన్‌లో ఘోర భూకంపానికి ముందు ‘ఓర్ ఫిష్’లు తరచూ కనిపించాయని గుర్తు చేసుకుని హడలిపోతున్నారు. భూకంపాలు, సునామీల వంటి విపత్తులు రాబోతున్నాయన్న దానికి ఇది గుర్తులని..ఇక ఇప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని వణికిపోతున్నారు. ఇంతకుముందు మూడు నెలల కింద న్యూజిలాండ్ లోని బీచ్ లో ఒక ఓర్ ఫిష్ ను స్థానికులు గుర్తించారు.
కానీ ఈ ‘ఓర్ ఫిష్’లను చూసి ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు నిపుణులు. ‘ఓర్ ఫిష్’లు అరుదైన చేపల జాతి అని.. అవి ఎక్కువగా సముద్ర అడుగుభాగాన నివసిస్తాయని..వాటికి ఆరోగ్యం బాగోలేని సమయంలోను..బ్రీడింగ్ సమయంలో నీటి పైభాగానికి వస్తాయని..వివరించారు. నీటిపైభాగానికి వచ్చినప్పుడు అవి మత్స్య కారుల వలలకు చిక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. అవి కనిపిస్తే భూకంపాలు, సునామీలు వస్తాయన్నది కేవలం ప్రజల నమ్మకం మాత్రమేనని.. సముద్రం అడుగున భూమి పొరల్లో కదలికలు వచ్చినప్పుడు ఆ అలజడి కారణంగా నీటి ఉపరితలానికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.