Philippines President: 36ఏళ్ల క్రితం దేశం నుంచి తన కుటుంబాన్ని వెళ్లగొట్టారు.. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు..

ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గురువారం ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మానీలాలోని నేషనల్ మ్యూజియంలో స్థానిక సమయం 12గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మార్కోస్ జూనియర్ తండ్రి ఫెర్డినాండ్ 1965 నుంచి 1986 వరకు ఫిలిప్పీన్స్ లో అధికారంలో ఉన్నారు.

Philippines President: ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గురువారం ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మానీలాలోని నేషనల్ మ్యూజియంలో స్థానిక సమయం 12గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మార్కోస్ జూనియర్ తండ్రి ఫెర్డినాండ్ 1965 నుంచి 1986 వరకు ఫిలిప్పీన్స్ లో అధికారంలో ఉన్నారు. 1986లో మార్కోస్ కుటుంబానికి వ్యతిరేకంగా లక్షలాది మంది తిరుగుబాటు చేశారు. దీంతో మార్కోస్ కుటుంబం దేశం విడిచిపెట్టి హవాయికి పయనమైంది. అప్పుడు మార్కోస్ జూనియర్ వయస్సు 28 సంవత్సరాలు.

Philippines : భారీ వర్షాలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం.. విరిగిపడుతున్న కొండచరియలు.. వారంరోజుల్లో 121 మంది మృతి..

ఎలాగైనా తన దేశంలో అడుగిడాలని మార్కోస్ జూనియర్ కు కోరిక ఉండేది. ఈ క్రమంలో మార్కోస్ జూనియర్ 1991 సంవత్సరంలో తిరిగి ఫిలిప్పీన్స్ కు తిరిగి వచ్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన కటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే9న జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలిచారు. మార్కోస్ జూనియర్ తన కుటుంబం గతాన్ని బట్టి కాకుండా, ప్రస్తుతం నాతీరు ద్వారా తనను అంచనా వేయమని ఫిలిప్పిన్స్ ప్రజలను కోరాడు. కానీ అతని ఎన్నికల ప్రచారంలో అతని తండ్రి వారసత్వం ఆధిపత్యం చెలాయించింది. అయితే ఫిలిప్పిన్స్ ప్రజలు మాత్రం మార్కోస్ జూనియర్ మద్దతుగా నిలిచారు. దీంతో తిరిగి 36ఏళ్ల తరువాత మార్కోస్ కుటుంబం నుంచి మార్కోస్ జూనియర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?

మార్కోస్ జూనియర్ ను ఫిలిప్పీన్స్‌లో “బాంగ్‌బాంగ్” అనికూడా పిలుస్తారు. మే 9 ఎన్నికలలో జాతీయ ఐక్యత వేదికపై భారీ మెజారిటీతో గెలుపొందారు. అధిక ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు, వ్యవసాయంకు ప్రాధాన్యత, తదితర హామీలతో ప్రజలను తనవైపు తిప్పుకోవటంలో మార్కోస్ జూనియర్ సఫలమయ్యారు. 60శాతం ఓట్లు సాధించారు. అయితే మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కుమార్తె సారా డ్యుటెర్టె ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ట్రెండింగ్ వార్తలు