CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?

అంతరిక్షంలో నంబర్‌ వన్ కావాలని చైనా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. అంతరిక్ష సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఆ కల నిజం చేసుకోవాలని భావిస్తుంది. ఐతే చైనా కల సాకారం అయ్యేనా.. నంబర్‌ వన్ స్థానం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు ఏంటి..

CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?

China Solar Station In Space (1)

CHINA Solar station in space : అంతరిక్షంలో నంబర్‌ వన్ కావాలని చైనా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. అంతరిక్ష సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఆ కల నిజం చేసుకోవాలని భావిస్తుంది. ఐతే చైనా కల సాకారం అయ్యేనా.. నంబర్‌ వన్ స్థానం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు ఏంటి.. తమ దేశానికి పోటీ అని డ్రాగన్ ఏ దేశాలను లెక్కలోకి తీసుకుంటోంది.. స్పేస్‌ సోలార్ ప్రాజెక్ట్‌తో పాటు చైనా చేసిన ఎలాంటి ప్రయోగాలు చేస్తోంది..

ప్రపంచానికి పెద్దన్న కావాలన్నది చైనా కల ! ఆ స్థానం కోసం ఎన్నో చేస్తోంది డ్రాగన్‌ కంట్రీ. పక్కదేశాలను ఆక్రమిస్తోంది. ప్రపంచదేశాలకు సవాల్‌ విసురుతోంది. అమెరికాతో డైరెక్ట్‌గానే ఢీ అంటే ఢీ అంటోంది. భూమి నుంచి ఆకాశం, అంతరిక్షం వరకు.. ప్రతీచోట అప్పర్‌హ్యాండ్‌ అయ్యే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్‌. ఇప్పుడు అమెరికాకు దీటుగా అంతరిక్షంలో ఆధిపత్యం సాధించేలా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేసిన డ్రాగన్‌.. అంతరిక్షంలో తొలి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. 2028 నాటికి పూర్తి చేసి.. అంతరిక్ష ప్రయోగాల్లో పైచేయి సాధించాలని ప్లాన్ చేస్తోంది.

Also read : CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు చైనా ప్లాన్..2028కల్లా పక్కా అంటోన్న డ్రాగన్ దేశం

చైనా ఏం చేసినా.. దాని వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే.. అగ్రరాజ్యంగా ఎదగాలని ! భవిష్యత్‌లో అంతరిక్ష అగ్రరాజ్యంగా ఎదగాలనే లక్ష్యంగా దిశగా చైనా అడుగులు వేస్తోంది. తియాంగాంగ్, హెవెన్లీ ప్యాలెస్ అనే కొత్త అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్‌ను… గతేడాది చైనా కక్ష్యలోకి పంపించింది. ఈ ఏడాది చివరినాటికి సైన్స్ ల్యాబ్‌తోపాటు మరిన్ని మాడ్యూల్స్‌ను కూడా అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది ‘షుంటియాన్‌గా పిలిచే స్పేస్ టెలిస్కోప్‌ను కూడా అంతరిక్షంలోకి పంపనుంది. సర్వీసింగ్‌కు, ఇంధనం నింపుకొనేందుకు ఈ టెలిస్కోప్.. అంతరిక్ష కేంద్రానికి సమీపానికి వెళ్తుంది.

కృత్రిమ సూర్యుణ్ని తయారుచేసుకున్న చైనా..!!

చైనా లక్ష్యాలు కేవలం అంతరిక్ష కేంద్రానికి మాత్రమే పరిమితం కావు. భూమికి సమీపంలోని కొన్ని గ్రహశకలాల నుంచి రాళ్ల నమూనాలను భూమికి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. 2030నాటికి చంద్రుడిపైకి తమ దేశానికి చెందిన తొలి వ్యోమగాములను పంపాలని భావిస్తోంది. అంగారకుడు, బృహస్పతి నుంచి శిలలను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. ఉపగ్రహ సాంకేతికత అభివృద్ధిపై చైనా ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇప్పుడు స్పేస్‌లో నిర్మించనున్న సోలార్‌ ప్రాజెక్ట్‌ విద్యుత్‌ కూడా.. ఉపగ్రహాలకే ముందుగా అందుతుంది. చైనా ప్రయోగిస్తున్న చాలా ఉపగ్రహాలను సైనిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలపై నిఘా పెట్టడం, దీర్ఘశ్రేణి క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థల కోసం వీటిని ప్రయోగిస్తున్నారు.

Also read : China’s AI Drone Ship: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ తయారు చేసిన చైనా..ప్రపంచంలో తొలి షిప్ ఇదే..

స్పేస్‌లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేస్తే.. అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే చైనా పేరు నిలిచిపోతుంది. ఇక అదే సమయంలో స్పేస్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి మిగతా దేశాలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయ్. దీంతో 2028కి పూర్తిచేయాలని ముందుగా భావించినా.. అనుకున్న లక్ష్యానికి రెండేళ్ల ముందుగానే పూర్తి చేయాలని డ్రాగన్ పట్టుదలతో కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరిగి.. ఎలాంటి నష్టం లేకుండా భూమ్మీదకు చేరుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు. ప్రాజెక్ట్ పేరుతో… మిగతా ఉపగ్రహాలు, దేశాల మీద నిఘా పెట్టాలని చూస్తే.. చైనా దిగజారుడుతనానికి మరో ప్రతీకగా నిలుస్తుంది.

చైనా ఏ కొత్త ప్రయోగం చేసినా.. నిర్మాణం చేపట్టినా.. దాని వెనక భారీ కుట్ర దాక్కొని ఉంటుంది. భూమ్మీద నుంచి అంతరిక్షం వరకు.. డ్రాగన్ వేసిన అడుగులు అదే ప్రూవ్ చేశాయ్. ఐతే ఇప్పుడు అంతరిక్షంలో సోలార్‌ ప్లాంట్ నిర్మాణంతో.. చైనా ఏం చేయాలి అనుకుంటోంది. నిజంగా టాప్ ప్లేస్‌ కోసం మాత్రమే ఈ ప్రయోగమా.. లేదంటే ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలన్న కుట్ర దాక్కొని ఉందా.. సోలార్‌ ప్లాంట్‌ పేరుతో మిగతా దేశాల ఉపగ్రహాలను, వాటి సమాచారాన్ని సేకరించి.. ఆ దేశాలపై నిఘా పెట్టేలా ప్లాన్ చేసే ప్రమాదం ఉందా అన్న అనుమానాలు… ఇప్పుడు చైనా తీరుతో వినిపిస్తున్నాయ్. ఏమైనా చైనాను అంత ఈజీగా నమ్మడానికి లేదు. ఏ కొత్త పని ప్రారంభించినా.. దాని వెనక కుట్రే లక్ష్యంగా పెట్టుకొనే చైనాపై.. మిగతా దేశాలు ఓ కన్నేసి ఉంచాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Also read :  China Artificial Sun :కృత్రిమ సూర్యుడితో చైనా కొత్త రికార్డు..సహజ సూర్యుడి కంటే 5రెట్లు ఎక్కువే సాధించిన డ్రాగన్ దేశం