China’s AI Drone Ship: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ తయారు చేసిన చైనా..ప్రపంచంలో తొలి షిప్ ఇదే..

చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ రూపొందించింది. సిబ్బందితో పనిలేకుండా ఈ షిప్ భారీ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించగలదు. సముద్రంపై పరిశోధనలు జరిపేందుకు ఇది రూపొందించామని చైనా చెబుతున్నప్పటికీ ఇది...

China’s AI Drone Ship: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ తయారు చేసిన చైనా..ప్రపంచంలో తొలి షిప్ ఇదే..

China’s Ai Drone Vessel ‘zhoushan’

China’s AI drone vessel ‘Zhoushan’ : అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీపడుతున్న చైనా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ రూపొందించింది. సిబ్బందితో పనిలేకుండా ఈ షిప్ భారీ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించగలదు. సముద్రంపై పరిశోధనలు జరిపేందుకు ఇది రూపొందించామని చైనా చెబుతున్నప్పటికీ ఇది…మిలటరీ అవసరాల కోసమే రూపొందించారని నిపుణులు అంటున్నారు.

చైనా అధునాతన షిప్ రూపొందించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఈ షిప్‌కు సిబ్బందితో పనిలేదు. సొంతంగా సముద్ర జలాల్లో విహరించగలదు. జు హై యన్ అనే ఈ షిప్‌ డజన్ల కొద్దీ డ్రోన్లను ప్రయోగించగలదు. ప్రపంచంలో ఇలా AI టెక్నాలజీతో రూపొందించిన తొలి షిప్ ఇదే. 290 అడుగుల పొడుగు, 45 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉండే ఈ షిప్ డజన్ల కొద్దీ డ్రోన్లు ఉంటాయి. సముద్రం లోపలి నుంచి, ఉపరితలం నుంచి ఈ డ్రోన్లు ప్రయోగించవచ్చు. సముద్రంలో పరిశోధనల కోసం దీన్ని రూపొందించినట్టు చైనా చెబుతున్నప్పటికీ..ఇది మిలటరీ అవసరాల కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేశారని నిపుణులు చెబుతున్నారు.

ఈ షిప్ వల్ల చైనాకు కలిగే తక్షణ ప్రయోజనం సమాచార సేకరణ. విపత్తులు, పర్యావరణ మార్పులు వంటివాటిపై పరిశోధనలు జరిపేందుకు ఈ షిప్ ఉపయోగిస్తామని చైనా చెబుతోంది. అయితే దక్షిణ చైనా సముద్ర జలాలపై అనేక దేశాలతో ఉన్న వివాదాలను దృష్టిలో పెట్టుకునే డ్రాగన్ ఈ సాంకేతిక నౌక రూపొందించుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక సమాచారం సేకరించే వ్యవస్థ, డొమైన్ ఎవేర్ నెస్, నిఘా నిర్వహించగల సామర్థ్యం వంటి వాటితో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఈ షిప్ తురుపుముక్కగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

ఈ షిప్‌ను ఇంటెలిజెంట్ మొబైల్ ఓషన్ స్టీరియో అబ్జర్వింగ్ సిస్టమ్‌గా భావిస్తున్నామని చైనా అంటోంది. తనంత తానుగా నావిగేట్ చేసుకోగల ఈ షిప్‌ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. గంటకు 20 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సముద్ర పరిశోధక రంగంలో ఈ షిప్ ఓ విప్లవమని రూపకర్తలంటున్నారు. ఓడల నిర్మాణంలో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.