FIFA World Cup 2022 : బాడీ పార్టులు కనిపించే టైట్ డ్రెస్‌లపై నిషేధం.. ఫిఫా వరల్డ్ కప్‌లో మహిళలకు డ్రెస్ కోడ్

టైట్ డ్రెస్ లు ధరించడం, ఎక్స్ పోజింగ్ చేయడాన్ని నిషేధించారు. భుజాలను కప్పుతూ, మోకాళ్ల దిగువకు ఉండేలా మహిళలు దుస్తులు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

FIFA World Cup 2022 : ఖతార్ వేదికగా ఈ నెల 20వ తేదీ నుంచి ఫిఫా 2022 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహిళా అభిమానులకు డ్రెస్ కోడ్ ను విధించారు నిర్వాహకులు. టైట్ డ్రెస్ లు ధరించడం, ఎక్స్ పోజింగ్ చేయడాన్ని నిషేధించారు. భుజాలను కప్పుతూ, మోకాళ్ల దిగువకు ఉండేలా మహిళలు దుస్తులు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఖతార్ చట్టం ప్రకారం నిర్వాహకులు ఈ నిబంధనలు విధించారు.

FIFA వరల్డ్ కప్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఖతార్‌కు చేరుకుంటున్నారు. FIFA ప్రపంచ కప్ 2022 లో 32 దేశాలు పాల్గొంటున్నాయి. బ్రిటన్, అమెరికా దేశాల నుంచి వచ్చే మహిళా అభిమానులకు ఇది కాస్త నిరుత్సాహం కలిగించే వార్త అని చెప్పాలి. మహిళా అభిమానులు తమ శరీర భాగాలను బహిర్గతం చేసే దుస్తులను ధరించడం నిషేధం. ఖతార్‌లో ఉన్న చట్టాలను వారు గుర్తుంచుకోవాలి. ఇక్కడ బట్టలు బహిర్గతం చేయడం నిషేధించబడింది. FIFA తన వెబ్‌సైట్‌లో అభిమానులు తమకు నచ్చిన దుస్తులను ధరించవచ్చని చెప్పినప్పటికీ, వారు దేశ చట్టాలను గౌరవించాలని తమ శరీర భాగాలను కవర్ చేయాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

“ప్రజలు సాధారణంగా తమకు నచ్చిన దుస్తులను ధరించవచ్చు. మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ భవనాలు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు వారి భుజాలు, మోకాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ఉండాలి. ఖతార్‌లో ప్రయాణించే మహిళలు బిగుతైన దుస్తులు ధరించడం నిషేధం. ఒకవేళ విపరీతమైన వేడి కారణంగా అభిమానులు తమ షిర్లను తొలగిస్తే, వాటిని స్టేడియంలో అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తించవచ్చు.

ఒక నిర్దిష్ట సీటుపై జూమ్ చేయడానికి, ప్రేక్షకుడిని స్పష్టంగా చూడటానికి మా వద్ద హై-రిజల్యూషన్ ప్రత్యేక కెమెరాలు ఉన్నాయి. ఇది రికార్డ్ చేయబడుతోంది. కాబట్టి ఇది ఏదైనా పోస్ట్ ఈవెంట్ ఇన్వెస్టిగేషన్‌లో మాకు సహాయపడుతుంది” అని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నియాస్ అబుల్‌ రహిమాన్ అన్నారు.

కాగా, డ్రెస్ కోడ్‌ను పాటించని వారికి కఠిన శిక్షలు ఉంటాయని, జైలుకి కూడా పంపొచ్చని స్థానిక అధికారులు హెచ్చరించారు.