Fire Corona Hospital క‌రోనా ఆస్పత్రిలో అగ్నిప్ర‌మాదం..ఐసీయూలో 23 మంది మృతి

ఇరాక్‌లో ఓ క‌రోనా ఆస్పత్రిలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో హాస్పిట‌ల్ లో చికిత్స పొందుత‌న్న 23 మంది మృతి చెందారు.

Fire Corona Hospital  క‌రోనా ఆస్పత్రిలో అగ్నిప్ర‌మాదం..ఐసీయూలో 23 మంది మృతి

Fire Corona Hospital

Updated On : April 25, 2021 / 1:14 PM IST

fire accident in Corona hospital : ఇరాక్‌లో ఓ క‌రోనా ఆస్పత్రిలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో హాస్పిట‌ల్ లో చికిత్స పొందుత‌న్న 23 మంది మృతి చెందారు. బాగ్దాద్ శివార్ల‌లోని ఇబ్న్ అల్-ఖ‌తిబ్ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆదివారం తెల్ల‌వారుజామున ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది సజీవదహనమయ్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఫైరింజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల గోదాంలో పేలుళ్లు సంభ‌వించ‌డ‌మే అగ్నిప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని అధికారులు తెలిపారు.

ప్ర‌మాద స‌మ‌యంలో ఐసీయూలో 30 మంది రోగులు ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి సంబంధీకులు మొత్తం 120 మంది ఉన్నార‌ని, వారిలో 90 మందిని ర‌క్షించామ‌ని తెలిపారు. ఈ ప్ర‌మాదంలో 50 మందికిపైగా గాయ‌ప‌డ్డార‌ని వెల్ల‌డించారు. వారంద‌రిని ఇత‌ర ఆస్పత్రులకు త‌ర‌లించామ‌ని తెలిపారు.