ఏఏ దేశాల్లో కరోనా ఉంది: చైనా బయట దేశంలో నమోదైన తొలి కరోనా వైరస్ మరణం

  • Published By: vamsi ,Published On : February 3, 2020 / 05:53 AM IST
ఏఏ దేశాల్లో కరోనా ఉంది: చైనా బయట దేశంలో నమోదైన తొలి కరోనా వైరస్ మరణం

Updated On : February 3, 2020 / 5:53 AM IST

చైనా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సోకి వేల మంది మరణించినట్లుగా రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా చైనాతో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలు.. తమ దేశానికి ఈ వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అన్నట్లుగా భయాందోళనలో ఉన్నాయి. ఇఫ్పటికే అమెరికా చైనా దేశంలో ఉంటున్న అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలని ఆదేశాలు జారీ చేసింది.

చైనా దేశంలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ప్రబలినందున అమెరికన్లు ఆ దేశానికి వెళ్లవద్దని కోరడంతోపాటు నిషేధ ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే చైనాలో ఇప్పటివరకు 15,000మందికి ఈ వైరస్ సోకినట్లుగా తెలుస్తుంది. అయితే వుహాన్ నగరంలో డిసెంబర్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ వల్ల శ్వాస సంబంధిత అనారోగ్యంతో చనిపోతారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు చైనాలో మాత్రమే ఈ వైరస్ కారణంగా చనిపోగా.. ఫస్ట్ టైమ్ చైనాకు వెలుపల ఈ కేసు కారణంగా చనిపోయినట్లు తెలుస్తుంది. 

కరోనావైరస్ కారణంగా చైనా కాకుండా ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వుహాన్ నగరానికి చెందిన 44 ఏళ్ల చైనా వ్యక్తి ఫిలిప్పీన్స్‌లో చనిపోయినట్లుగా నివేదించారు. అయితే ప్రపంచాన్ని వఱికిస్తున్న ఈ కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు… థాయిలాండ్, జపాన్, హాంకాంగ్, సింగపూర్, తైవాన్, ఆస్ట్రేలియా, మలేషియా, మకావు, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, బ్రిటన్, వియత్నాం, ఇటలీ , ఇండియా, ఫిలిప్పీన్స్, నేపాల్, కంబోడియా, శ్రీలంక, ఫిన్లాండ్ మరియు స్వీడన్ దేశాలలో నమోదయ్యాయి.