Heart Touching Video : ఉప్పొంగిన ప్రేమ..బిడ్డను చేతిలోకి తీసుకుంటూ తండ్రి భావోద్వేగం
అప్పుడే పుట్టిన బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్న తండ్రి భావోద్వేగం వీడియో వైరల్ గా మారింది.బిడ్డ వంక అపురూపంగా చూస్తు కంటతడి పెట్టుకున్న తండ్రి మదిలో ప్రేమఉప్పొంగిపోయింది.

Fadher First Time Son
father’s emotion of holding the newborn baby in his arms : తొమ్మిది నెలలు మోసి కన్నబిడ్డ ఒడిలోకి వస్తే తల్లికి ఎంత సంతోషమో..అలాగే తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకునే సమయంలో తండ్రి భావోద్వేగం అంతకు మించి అనేలా ఉంటుంది. ఇదిగో దారిని ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో. అప్పుడే పుట్టిన తన బిడ్డను చేతుల్లోకి తీసుకునే సయమంలో ఓతండ్రి ఎంత భావోద్వేగానికి గురయ్యో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో తండ్రి అప్పుడే తన భార్య ప్రసవించిన బిడ్డను బయటకు తీసుకొచ్చింది నర్సు. అలా ఆ పసిబిడ్డను తండ్రికి ఇవ్వటానికి తీసుకొచ్చింది. దాంతో ఆ తండ్రి ఆనందం అంతా ఇంతా కాదు.మొదటిసారి బిడ్డను చూస్తు తెగ మురిసిపోయాడు. ఆ పసిబిడ్డను అపురూపమైన కానుకను చూసినట్లుగా చూసుకున్నాడు.
తాను ఎత్తుకున్నాక బిడ్డకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సర్ధుకుని సర్ధుకుని కూర్చుంటూ బిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ ఆ తండ్రి కట్టతడి పెట్టేశాడు. బిడ్డను చూసి నిలువెల్లా పులకరించిపోయాడు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మొదటిసారిగా తన కొడుకును చేతిలోకి తీసుకుంటూ కంటతడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా తమ బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసున్న మధుర క్షణాలు గుర్తుకుతెస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.
First-time father holds his newborn baby for the first time. (?:Chrisxia29_)
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 19, 2021